‘బ్రహ్మచారి’ సినిమాకు ప్రేక్షకాదరణ దక్కుతోంది - నిర్మాత రాంభూపాల్ రెడ్డి


అద్వితీయ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై రాంభూపాల్ రెడ్డి నిర్మాతగా ఎన్నో చిన్న చిత్రాలకు  పని చేసిన నర్సింగ్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన చిత్రం ‘బ్రహ్మచారి’.  తెలంగాణ యాసలో పర్‌ఫెక్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేసే మల్లేశం హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 10న థియేటర్లలో విడుదలై అన్ని చోట్ల నుంచి మంచి ప్రజాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాంభూపాల్ రెడ్డి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
 
*నిర్మాత రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ*..‘‘‘బ్రహ్మచారి’ సినిమాను మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందించాం. ఈ నెల 10న థియేటర్స్ లో రిలీజ్ చేశాం. ఏపీ తెలంగాణతో పాటు కర్ణాటక ,చెన్నై, ఒరిస్సాలోనూ మా మూవీ రిలీజైంది. రిలీజైన అన్ని చోట్ల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. అయితే హైదరాబాద్ లో ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేయలేదు. అందువల్ల ఇక్కడి కంటే గ్రామీణ ప్రాంతాల్లో రెస్పాన్స్ బాగుంది. మల్టీప్లెక్స్ ల్లోనూ ఆదరణ దక్కుతోంది. మొదటి సినిమాకే నిర్మాతగా సంతృప్తి దక్కింది. మంచి సినిమా చేశామంటూ చూసిన ప్రతివారూ చెబుతున్నారు. ‘బ్రహ్మచారి’ సినిమాకు వస్తున్న స్పందనతో తొలి ప్రయత్నంలోనే మేము విజయం సాధించినట్లే అనుకుంటున్నాం. మా సినిమాలోని ఎంటర్ టైన్ మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకుంటున్నాయి. టాక్ బాగుండటంతో థియేటర్స్ పెంచుతున్నాం. పోలింగ్ ఉండటం వల్ల సోమవారం కొంత కలెక్షన్స్ తగ్గుతాయి. అయితే మళ్లీ పోలింగ్ నెక్ట్స్ డే నుంచి మా సినిమాను మరింతగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తాం. సక్సెస్ మీట్ కూడా నిర్వహించబోతున్నాం. ఇవాళ అనేక కారణాలతో యువకులకు పెళ్లిల్లు కావడం లేదు. వారు బ్రహ్మచారులుగా సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవి వారికి కష్టమైనా, చూసే వారికి వినోదాన్ని అందిస్తాయి. ఈ నేపథ్యంతో ‘బ్రహ్మచారి’ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. అన్నారు.


నటీ నటులు 
మల్లేశం, స్వప్న (కీస్ పిట్ట ), సిరి,రోషిని రజాక్, జూనియర్ రజాక్, రామ స్వామి, లక్ష్మి, స్రవంతి,జబర్దస్త్  ఇటుక నవీన్, శ్రీ కుమారి, మహేందర్ శీలం , ఉదయ్, సైదయ్య, అభిషేక్, విజయ లక్ష్మి తదితరులు


సాంకేతిక నిపుణులు 
బ్యానర్ : అద్వితీయ ఎంటర్‌టైనర్స్
నిర్మాతలు : రాంభూపాల్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : నర్సింగ్ 
సినిమాటోగ్రఫీ : కర్ణ ప్రియాసన్
( అసిస్టెంట్ : శ్రీనివాస్ )
డైలాగ్స్ అండ్ లిరిక్స్ : దోర వేటి 
మ్యూజిక్ : పాండురంగ, 
బి. జి. యం : ఎల్. ఎం. ప్రేమ్ 
కొరియోగ్రఫీ :  రజాక్ 
కో ప్రొడ్యూసర్స్ : చిట్టిబాబు, హస్సాన్ , జావిద్ 
ఆర్ట్ డైరెక్టర్ : నరేందర్ 
ఎడిటర్ : సాయి ఆకుల విజయ్ 
స్టంట్స్ : ఖురేషీ 
ప్రొడక్షన్ మేనేజర్ : భాస్కర్
పీఆర్వో: గోపీ

Comments

Popular posts from this blog

Surya Purimetla's character first look from 'Ari' was released on the occasion of the inauguration of Ayodhya Ram Mandir

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

త్రిగుణ, మేఘా చౌదరి, మల్లి యేలూరి, Dr Y. జగన్ మోహన్, యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ 'జిగేల్' ఫస్ట్ లుక్ రిలీజ్