ఆ ఇద్దరే ఎందుకు ముఖ్యమంత్రులుగా ఉండాలి?* రాష్ట్రానికి బీసీ, దళిత, కాపు సీఎంలు ఉండకూడదా..?

* బీసీవై ఆధ్వర్యంలో 23న వివిధ సంఘాలతో సమావేశం
* కుటుంబ పార్టీలకు అంతం పలికేందుకు రండి 
* బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ పిలుపు..

సమాజంలో మార్పు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, బలహీన వర్గాల రాజ్యాధికారం లక్ష్యంగా రాజకీయ పార్టీ స్థాపించిన భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత బొడె రామచంద్ర యాదవ్.. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, వ్యాపార సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 23న మంగళగిరి లోని హ్యాపీ రిసార్ట్స్ నందు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకూ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు రామచంద్ర యాదవ్ తెలిపారు. 

*ఆ ఇద్దరే ముఖ్యమంత్రులుగా ఉండాలా..?*

దోచుకుతింటున్నా.. దోపిడీ చేస్తున్నా.. ఆరాచకం  సాగిస్తున్నా.. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నా.. యువతను బలి చేస్తున్నా .. ఆ రెండు కుటుంబాలే పాలించాలా..? ఆ ఇద్దరే ముఖ్యమంత్రులుగా ఉండాలా ..? 90 శాతం జనాభా ఉన్న వర్గాలకు ఎందుకు అధికారం దక్కకూడదు..! బీసీ, దళిత, కాపు, మైనార్టీ ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు ? అని ఆయన ప్రశ్నించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మన బలం చూపిద్దామని అని విజ్ఞప్తి చేశారు. కుటుంబ పార్టీలకు అంతం పలికి, ప్రజా రాజకీయం దిశగా రాష్ట్రాన్ని నడిపించేందుకు పూనుకుందామని, దీనిపై విస్తృతంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుందామని రామచంద్ర యాదవ్ విజ్ఞప్తి చేశారు. 

*ఈ రాజకీయ పక్షాల ప్రతినిధులు మినహా* 

ఈ సమావేశానికి వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ మినహా ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధులు హజరు కావాలని కోరారు. బీసీ, కాపు, దళిత, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, క్షత్రియ, మైనార్టీ సంఘాల ప్రతినిధులతో పాటు నిరుద్యోగ జేఏసీ, ఉద్యోగ, వాణిజ్య సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులు, రైతు, విద్యార్ధి, ప్రజా సంఘాల ప్రతినిధులకు ఆహ్వానం పలుకుతున్నట్లు బీసీ యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించి ఇతర వివరాలకు 8340890999,
8297190999, 8886312345 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.

Comments

Popular posts from this blog

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి త్వరలో రాబోతున్న సత్యం రాజేష్, శ్రవణ్ , కాలకేయ ప్రభాకర్ !!!