హోళీ సెలెబ్రేషన్స్ లో ఫ్యామిలీస్ తో థర్డ్ సింగిల్ “ మధురము కదా “ లిరికల్ సాంగ్ లాంచ్ చేసిన ఫ్యామిలీ స్టార్ టీం
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్" సినిమా నుంచి థర్డ్ సింగిల్ 'మధురము కదా..' లిరికల్ సాంగ్ ను హైదరాబాద్ లోని మై హోమ్ జెవెల్ గేటెడ్ కమ్యూనిటీలో హోలీ వేడుకల మధ్య గ్రాండ్ గా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు. "ఫ్యామిలీ స్టార్" సినిమా టీమ్ కు మై హోమ్ జెవెల్ ఫ్యామిలీస్ హార్టీ వెల్ కమ్ చెప్పారు. మూవీ టీమ్ తో హోలీ ఆడుతూ, కలిసి డ్యాన్సులు చేస్తూ, ఫొటోస్ తీసుకుంటూ సందడి చేశారు. ఈ సాంగ్ లాంఛ్ సందర్భంగా
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ - మా "ఫ్యామిలీ స్టార్" సినిమా టీమ్ కు వెల్ కమ్ చెప్పిన మీ ఫ్యామిలీస్ అందరికీ థ్యాంక్స్. ఏప్రిల్ 5న "ఫ్యామిలీ స్టార్" రిలీజ్ కు వస్తోంది. ఫ్యామిలీ స్టార్ అంటే ఏంటో నేను మీకు చెప్పాను. తన కుటుంబాన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టేందుకు కష్టపడే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టారే. ఈ కథ మొదట విజయ్ విన్నాడు. నాకు ఫోన్ చేసి పరశురామ్ మంచి స్టోరీ చెప్పాడు మీరు వింటారా అని అడిగాడు. నేను కథ విన్నాక 15 నిమిషాల్లో ఓకే చెప్పేశాను. ఎందుకంటే ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కథ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎమోషన్స్ అన్నీ విజయ్ క్యారెక్టర్ లో చూస్తారు. పాటలు, డైలాగ్స్, హీరోతో చెప్పించిన మానరిజమ్స్ అన్నీ రేపు థియేటర్స్ లో మిమ్మల్ని మీరు చూసుకున్నట్లు ఉంటుంది. ఏప్రిల్ 5న ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా మా సినిమా చూసేందుకు థియేటర్స్ కు పరుగులు పెడతారు. అన్నారు.
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - నేను చదువుకునే రోజుల్లో హోలీ పండుగ అంటే భయపడేవాడిని. రంగులు పూస్తారు, అవి అలాగే ఉండిపోతాయని ఇంట్లోనే ఉండిపోయేవాడిని. అదే టైమ్ లో ఎగ్జామ్స్ జరుగుతుంటే చాలా మంది మొహం నిండా రంగులతో వచ్చేవారు. కానీ ఇక్కడ మీ అందరితో కలిసి హోలీ జరుపుకుంటుంటే పండుగంటే ఇలా ఉండాలని అనిపిస్తోంది. మీ అందరి ఎగ్జామ్స్ కంప్లీట్ అయినట్లు ఉన్నాయి. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ సినిమా చూసేందుకు థియేటర్స్ కు రండి. మన లాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఒక పర్సన్ కథ ఇది. ఫ్యామిలీ గురించి ఆలోచించే వారి కథ. థియేటర్స్ లో సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నారు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ - హోలీ పండుగను ముంబైలో చేసుకుంటూ ఉంటాను. ఈసారి మీ మధ్య ఫ్యామిలీ స్టార్ మూవీ టీమ్ తో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉంది. మీ ఫ్యామిలీస్, మీ ఫ్యామిలీ స్టార్స్ కు హ్యాపీ హోలీ. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ సినిమా చూసేందుకు థియేటర్స్ కు మీరంతా రావాలి. అన్నారు.
'మధురము కదా..' పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా..శ్రేయా ఘోషల్ పాడారు. గోపి సుందర్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు.
'మధురము కదా.. ప్రతి ఒక నడక నీతో కలిసి ఇలా, తరగని కథ మనది కనుక మనసు మురిసెను ఇలా, ఉసురేమో నాదైనా, నడిపేది నీవుగా..కసురైన విసురైన విసుగేమి రాదుగా ..అంటూ క్యాచీ లిరిక్స్ తో సాగుతుందీ పాట. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన "ఫ్యామిలీ స్టార్" పాటలన్నీ ఇన్ స్టంట్ గా ఛాట్ బస్టర్స్ అవుతున్నాయి. థర్డ్ సింగిల్ 'మధురము కదా..' లిరికల్ సాంగ్ కూడా వినగానే మ్యూజికల్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. "ఫ్యామిలీ స్టార్" సినిమా ట్రైలర్ ను ఈ నెల 28న రిలీజ్ చేయబోతున్నారు.
"ఫ్యామిలీ స్టార్" సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. "ఫ్యామిలీ స్టార్" చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు
టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్
సంగీతం : గోపీసుందర్
ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
పీ ఆర్ ఓ : జి.యస్.కే మీడియా, వంశీ కాక
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ
నిర్మాతలు : రాజు - శిరీష్
రచన, దర్శకత్వం - పరశురామ్ పెట్ల
Comments
Post a Comment