కలియుగం పట్టణంలో రివ్యూ & రేటింగ్ !!!


రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.

మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మాతలు నిర్మించినటువంటి చిత్రం కలియుగం పట్టణంలో(Kaliyugam Pattanamlo ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇక ఈ సినిమా నేడు 29 మార్చి 2024 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మరి ఈ సినిమా కథ ఏమిటి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంది అనే విషయానికి వస్తే.

నంద్యాలలో మోహన్ (దేవీ ప్రసాద్), కల్పన (రూప లక్ష్మి) తమ కవల పిల్లలు విజయ్ ( విశ్వ కార్తికేయ),( Vishva Karthikeya ) సాగర్(విశ్వ కార్తికేయ) తో కలసి హాయిగా జీవిస్తున్నారు.ఇక విజయ్ కి రక్తం చూస్తే చాలా భయపడుతూ ఉంటారు కానీ తను రక్తం చూసి భయపడితే సాగర్( Sagar ) మాత్రం ఆనందపడుతూ ఉంటారు.సాగర్ బయటకు వస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయోనని చెప్పి చిన్నప్పుడే సాగర్ ఒక మెంటల్ హాస్పిటల్ కు వెళ్తుంది.

అలా కొన్ని నెలలు  గడుస్తాయి.ఇక కాలేజీలో  విజయ్ మంచితనం చూసి శ్రావణి( ఆయుషి పటేల్)( Aayushi Patel ) ఇష్టపడుతుంది.

అత్యాచారాలు చేసే క్రూర మృగాలను వేటాడి చంపుతూ ఉంటుంది.నంద్యాలలో జరిగే ఘోరాలను అడ్డుకునేందుకు పోలీస్ అధికారి (చిత్రా శుక్లా) వస్తుంది.

ఆమె కనిపెట్టిన విషయాలు ఏంటి? అసలు విజయ.సాగర్ లలో ఎవరు మంచి వారు.

  ఎవరు చెడ్డ వారు.అక్కడ జరిగే ఘోరాలతో వీరికి ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలు తెలియాల్సి ఉంది.


విజయ్, సాగర్ పాత్రల్లో విశ్వ తన వేరియేషన్స్ చూపించాడు.మంచి వాడిగా, సైకో పాత్రలో కూడా ఎంతో అద్భుతంగా నటించారు ఇక యాక్షన్స్ సన్ని వేషాలలో కూడా విజయ్ సాగర్( Vijay Sagar ) అద్భుతమైన నటనను కనపరిచారని చెప్పాలి.ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఆయుషి పటేల్ మొదటి ఆఫ్ మొత్తం పెద్ద ఎత్తున సందడి చేశారు.

ఇక శుక్ల సెకండ్ హాఫ్ అద్భుతమైనటువంటి నటనని కనబరిచారని చెప్పాలి.ఇలా ప్రతి ఒక్కరు కూడా వారి పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.

టెక్నికల్:

టెక్నికల్ పరంగా కలియుగ పట్టణంలో అనే సినిమా ఎంతో మంచి సక్సెస్ సాధించిందని చెప్పాలి.చరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది.

నిర్మాణ పరంగా సినిమా బాగుంటుంది.లైవ్ లొకేషన్స్ వల్ల ఫ్రేమ్స్ అన్నీ కూడా ఎంతో సహజంగా అనిపిస్తాయి.

నిర్మాణాత్మక విలువలు కూడా బాగున్నాయి సినిమా నిర్మించే విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదని తెలుస్తుంది.

ఇప్పటికే ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు( Crime Thriller Movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.అయితే క్రైమ్ సినిమాలను ఈ విధంగా కూడా చేయొచ్చా అనే విధంగా దర్శకుడు సరికొత్త పాయింట్ ద్వారా సినిమాను అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఈ సినిమాలో మొదటి భాగం చాలా ప్రశ్నలు చిక్కుముడులు కనిపిస్తాయి కానీ రెండో భాగంలో ఆ ప్రశ్నలన్నింటికీ ఒక్కొక్క సమాధానాన్ని రివిల్ చేస్తూ చూపించారు.

ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఆసక్తిగా కొనసాగుతుంది కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం అంత ఇంట్రెస్ట్ గా లేదని చెప్పాలి.ఇక పిల్లల పెంపకం ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు అనే విషయాలను కూడా దర్శకుడు చాలా అద్భుతంగా చూపించారు.

ప్లస్ పాయింట్స్:

సినిమా కథ కథనం, నటీనటుల నటన, ఫస్ట్ హాఫ్, క్లైమాక్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్ అయ్యాయి.

మైనస్ పాయింట్స్:

సెకండ్ హాఫ్ కాస్త స్లోగా సాగటం అక్కడక్కడ కొన్ని సన్నివేశాలను సాగదీశారు.

బాటమ్ లైన్:

క్రైమ్ సినిమా అయినప్పటికీ సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ముఖ్యంగా పిల్లల పెంపకం అనేది ఎలా ఉండాలనే విషయాన్ని డైరెక్టర్ అద్భుతంగా చూపించారు.

రేటింగ్: 3


Comments

Popular posts from this blog

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

"ది ఇండియన్ స్టోరి" రివ్యూ - మంచి సందేశం, వినోదం కలిపిన సినిమా

టోని కిక్, సునీత మారస్యార్ హీరో హీరోయిన్లుగా A3 లేబుల్స్ బ్యానర్‌పై బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో లాంఛనంగా ప్రారంభమైన చిత్రం