పెనమలూరు నుంచి ఫిక్స్.. బరిలోకి యువనేత!
గతంలో ఎప్పుడూ లేనివిధంగా చాలా ఫాస్ట్‌గా అభ్యర్థులను ప్రకటిస్తున్న తెలుగుదేశం పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే 128 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించగా.. ఈసారి యువతకు పెద్దపీట వేస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా ఉన్న కృష్ణాజిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గంపై కూడా అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది.
ఇక్కడినుంచి విజయవాడకు చెందిన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని చంద్రశేఖర్(చందు)కు టిక్కెట్ ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. నారా లోకేష్‌కి దగ్గరగా ఉండడం.. పార్టీ యువత కార్యక్రమాల్లో చురుకుదనం.. యువగళం నిర్వహణలో క్రియాశీలకంగా ఉండడం తదితర కారణాలతో పాటు యువతకు ఎక్కువ సీట్లు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుగుదేశం చందుకు సీటు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుగుదేశం కార్యవర్గాలు చెబుతున్నాయి.
గతంలో దేవినేని చందు గన్నవరంలో పోటీ చేయడానికి రెడీగా ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, తర్వాతికాలంలో అక్కడ నుంచి యార్లగడ్డ వెంకట్రావు పోటీకి సిద్ధం అవడంతో దేవినేని చందుకు వేరే చోట నుంచి పోటీకి అవకాశం ఇవ్వాలని భావించింది అధిష్టానం. ఇటీవల లిస్ట్‌లో కూడా యువనేతలకు చాలామందికి సీట్లు ఫిక్స్ చేయగా.. ఇప్పుడు చందుకు కూడా పెనమలూరు నుంచి పోటీ చేసేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు టికెట్‌ను ఇవ్వలేకపోతున్నామని టీడీపీ అధిష్టానం ఇప్పటికే ఆయనకు స్పష్టం చేసింది.
Comments
Post a Comment