ఫిబ్రవరి 16న “ఐ హేట్ లవ్ "

సుబ్బు ,శ్రీవల్లి , కిట్టయ్య ప్రధాన పాత్రలో “ ఐ హేట్ లవ్ “  నేనూ ప్రేమలో
 పడ్డాను ఉపశీర్షి.  ఫిబ్రవరి 16న ఈ చిత్రం థియేటర్లో విడుదల కానుంది. ఈ నేపద్యంలో గుడుంబా శంకర్ చిత్ర దర్శకుడు వీరశంకర్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా
వీర శంకర్  మాట్లాడుతూ ట్రైలర్ చాలా బాగుంది  సహజత్వంగా బాగా చిత్రీకరించారని అన్ని వర్గాలవారికి ఈ చిత్రం నచ్చుతుందని  ఈ చిత్రం మంచి సక్సెస్ అవుతుందని మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆధరిస్తారని చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. నిర్మాత  డాక్టర్ బాల రావి గారు  (USA)   మాట్లాడుతూ కథ పరంగా  ఎక్కడ రాజీపడకుండా అద్భుతంగా తెరకెక్కించాము. గోదావరి ఒడ్డున కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మా సినిమా అంత ప్రశాంతంగా ఆస్వాదించవచ్చన్నారు.
కో- ప్రొడ్యూసర్ పాలగుమ్మి వెంకట కృష్ణ  మాట్లాడుతూ మంచి చిత్రాలను ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఈ చిత్రం తీసామన్నారు. దర్శకుడు వెంకటేష్.వి మాట్లాడుతూ  గోదావరి జిల్లా యాసతో  పూర్తిగా కోనసీమ పరిసరప్రాంతాల్లో  షూటింగ్ చేయడం జరిగింది. ఇది యూత్ ని బాగా ఆకట్టుకునే సందేశాత్మక కథ.  పెద్దపల్లి రోహిత్ సంగీతాన్ని అందించారు. పాటలకి మంచి స్పందన వచ్చింది, మా సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నానన్నారు. అలాగే అంగర శివ సాయి గౌడ ఈ సినిమాకి  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేసారు,
ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏస్ కె యల్ ఎమ్ మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ కాబోతుంది అన్నారు.

Comments

Popular posts from this blog

Surya Purimetla's character first look from 'Ari' was released on the occasion of the inauguration of Ayodhya Ram Mandir

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"