వినోదంతో పాటు హృదయాన్ని కదిలించే సినిమా తీయడమే లక్ష్యంగా ఇండస్ట్రీకి వచ్చానంటున్న... "మెకానిక్"

వినోదంతో పాటు హృదయాన్ని కదిలించే సినిమా తీయడమే లక్ష్యంగా ఇండస్ట్రీకి వచ్చానంటున్న... "మెకానిక్" (Trouble shooter)సినిమా నిర్మాత  నాగ మునెయ్య (మున్నా )
 
నాకు చిన్నప్పటినుంచే  సినిమాలంటే  చాలా ఇష్టం. అందులో చిరంజీవి గారి సినిమాలంటే  యమ పిచ్చి, నా కాలేజీ రోజుల్లో  చిరంజీవిగారి పాటలకి స్టేజ్ మీద స్టెప్పులేసిన సందర్భాలెన్నో వున్నాయి... మరో వైపు దాసరి గారి సినిమా లన్నా...  విశ్వనాధ్ గారి సినిమాలన్నా తెలియని ఆరాధనా భావం వుండేది. అలా అన్నీ కలగలిపి మెచ్చురిటీ పెరిగే కొద్ది సినిమాలvమీద ఫ్యాషన్ పెరిగింది.  ఇండస్ట్రికి రావాలి, మంచి సినిమాలు తీయాలి అనే ధృడ నిర్ణయానికొచ్చి తొలి ప్రయత్నంగా  "మెకానిక్" అనే సినిమా తీయడం జరిగింది.  ఈ సినిమా లో మంచి వినోదంతో పాటు హృదహాయాన్ని కదిలించే అంశాలెన్నో వున్నాయి.  ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన"నచ్చేసావే పిల్లా నచ్చావే" పాట ఇన్‌స్టాగ్రామ్,  యూట్యూబ్‌లో 10 మిలియన్ల దగ్గర views  సాధించి ట్రెండింగ్ లో ఉంది...ఇందులో కైలాష్ ఖేర్ పాడిన మరో పాట "అమ్మ ఎవ్వరో -అయ్య ఎవ్వరో తెలియదు అన్నావు " అనే పాట ఎవర్ గ్రీన్ గోల్డెన్ హార్ట్ టచింగ్ సాంగ్ ...ఇధి కేవలం  నా మాట మాత్రమే  కాదు..రేపు మీరు సినిమా చూశాక , ముక్తకంఠంతో చెప్పే మాట . ఆడియో మంచి విజయం సాధించింది ...ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాల బాగా వచ్చింది. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి గారు హీరోకి గాడ్ ఫాదర్ లాంటి క్యారెక్టర్ చేసారు.. ఆయన క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ హృదయాన్ని కట్టి పడేస్తుంది....ఈ సినిమాలో నాగ మహేష్, సూర్య, సమ్మెట  గాంధీ, చత్రపతి శేఖర్,కిరీటి దామరాజు , సంధ్యా జనక్, సునీత మనోహర్ ,జబర్దస్త్ దొర బాబు, జబర్దస్త్ ఫణి,మాస్టర్ చక్రి తధితరులు నటించారు...ఇది పక్కా మాస్ క్యారెక్టర్ బేస్డ్ మూవీ అయినప్పటికి అందరికి కనెక్ట్ అయ్యే,అందరిని కదిలించే చిత్రం ..ఇది  జీవితాన్ని...జీవితం యొక్క విలువని చెప్పే సినిమా ..ఇది ఫిబ్రవరి-02 వ తేదీన విడుదల అవుతోంది . మీరందరు థియేటర్ కెల్లి సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వాదిస్తరని ఆశిస్తున్నాను.

Comments

Popular posts from this blog

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

"ది ఇండియన్ స్టోరి" రివ్యూ - మంచి సందేశం, వినోదం కలిపిన సినిమా