Posts

స‌మంత ట్రా లా లా మూవింగ్ పిక్చ‌ర్స్ రూపొందించిన తొలి చిత్రం ‘శుభం’ టీజర్ విడుదల

Image
సమంత నిర్మాణ సంస్థ ట్రా లా లా మూవీ పిక్చర్స్ రూపొందిస్తోన్న తొలి చిత్రం ‘శుభం’. కామెడీ హారర్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తూ, భ‌య‌పెడుతూ, ఉత్కంఠ‌త‌కులోను త‌గిన స‌న్నివేశాలు, యూనిక్ స్టోరీతో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వుల్లో ముంచెత్త‌టానికి సిద్ధంగా ఉంది. ‘శుభం’ చిత్రంలో ప్ర‌తిభావంతులైన న‌టీన‌టులు అద్భుత‌మైన న‌ట‌న‌తో క‌థ‌లోని పాత్ర‌ల‌కు జీవం పోశారు. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా న‌వ్విస్తూ, థ్రిల్లింగ్ సన్నివేశాల‌తో మెప్పిస్తూ పూర్తి వినోదాత్మ‌క కుటుంబ క‌థా చిత్రంగా దీన్ని తెర‌కెక్కిస్తున్నారు. వివేక్ సాగ‌ర్ అద్భుత‌మైన సంగీతం మ‌రింత ఆస‌క్తిని పెంచుతోంది. ఈ వేస‌విలోనే సినిమాను విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు ఈ సంద‌ర్భంగా స‌మంత స్పందిస్తూ ‘‘ప్రేక్షకులు మా అందరి కష్టాన్ని వెండితెరపై వీక్షించి ఆశీర్వ‌దిస్తార‌ని అంద‌రం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. ‘శుభం’ సినిమా కోసం ఎంటైర్ టీమ్ ఎంతో క‌ష్ట‌ప‌డింది. దాన్ని మీ అంద‌రితో షేర్ చేసుకోవ‌టానికి మేం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాం’’ అన్నారు. ఈ వేస‌విలో న‌వ్వుల‌తో కూడిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘శుభం’ వ...

మల్లిడి కృష్ణ దర్శకత్వంలో కుశాల్ రాజు హీరోగా ఎంఎస్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 సినిమా ప్రారంభం

Image
స్టార్ డైరెక్టర్ వి వి వినాయక్ క్లాప్ తో ఘనంగా ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం  ప్రముఖ దర్శకుడు మల్లిడి వశిష్ట సోదరుడు మల్లిడి కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఎంఎస్ఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్. 1గా కుశాల్ రాజును హీరోగా పరిచయం చేస్తూ స్కైఫై డ్రామాను తెరకెక్కించబోతున్నారు. డా. లతా రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్స్ వీవీ వినాయక్, మల్లిడి వశిష్ట, ఎస్వీ కృష్ణారెడ్డితో పాటు నిర్మాతలు అచ్చిరెడ్డి, బెల్లంకొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి స్క్రిప్ట్‌ను అందజేయగా, వీవీ వినాయక్ ఫస్ట్ షాట్‌కు క్లాప్ కొట్టారు. మల్లిడి వశిష్ట ఫస్ట్ షాట్ డైరెక్టర్ చేశారు. ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.  పూజా కార్యక్రమంలో ... దర్శకుడు మల్లిడి కృష్ణ మాట్లాడుతూ..‘‘2012లో నా జర్నీ మొదలైంది. ఎన్నోమలుపులు తిరిగి మీ ముందుకు డైరెక్టర్‌గా వచ్చాను. లత గారికి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి...

ఫ‌స్ట్‌లుక్‌తోనే సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ `అమరావ‌తికి ఆహ్వాణం`

Image
ప్ర‌స్తుత కాలంలో హార‌ర్ థ్రిల్ల‌ర్ సినిమాల‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ మ‌ధ్యే బాలీవుడ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన ముంజ్య, స్త్రీ 2 సినిమాలే దానికి ఉదాహ‌ర‌ణ‌...అలాంటి ఒక ఉత్కంఠ‌భ‌రిత‌మైన క‌థ, క‌థ‌నాల‌తో సీట్ ఎడ్జ్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న చిత్రం `అమ‌రావ‌తికి ఆహ్వాణం`. `అక్క‌డొక‌డుంటాడు` ఫేమ్ శివ కంఠంనేని, ఎస్త‌ర్‌, ధ‌న్య‌బాల‌కృష్ణ‌, సుప్రిత, హ‌రీష్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ మూవీకి టాలెంటెడ్ రైట‌ర్‌, డెరెక్ట‌ర్ జివికె ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఉగాది సంద‌ర్భంగా ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. టైటిల్‌తోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన ఈ  మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్టర్‌ని గ‌మ‌నిస్తే..లీడ్ యాక్ట‌ర్స్ అంద‌రూ  బ్లాక్ డ్రెస్ వేసుకుని సీరియ‌స్‌ లుక్‌లో క‌నిపిస్తున్నారు. ఫేస్ లు పూర్తిగా రివీల్ కాన‌ప్ప‌టికీ అంద‌రి క‌ళ్ల‌లో ఒకేర‌క‌మైన ఇంటెన్సిటీ ఉంది.  ఒక‌ మంచి హార‌ర్ థ్రిల్ల‌ర్ కి కావాల్సిన మూడ్‌ పూర్తిగా క్యారీ అయింది. క్రియేటివ్‌గా ఉన్న‌ ఫ‌స్ట్ పోస్ట‌ర్ తోనే సినిమా ఎలా ఉండ‌బోతుంది అనే హింట్ ఇచ్చారు మేక‌ర్స్‌. ప్ర‌స్తుతం ఈ ఫ‌స్ట్‌...

నెలకు కేవలం 67 రూపాయల 'పాకెట్ ప్యాక్' ఆఫర్ అనౌన్స్ చేసిన ఆహా ఓటీటీ

Image
ఎగ్జైటింగ్ కంటెంట్ ను మరింతమంది సబ్ స్క్రైబర్స్ కు అందించేందుకు 'పాకెట్ ప్యాక్' ఆఫర్ అనౌన్స్ చేసింది ఆహా ఓటీటీ. కేవలం 67 రూపాయలతో మంత్లీ సబ్ స్క్రిప్షన్ ఇవ్వనుంది ఆహా. ఖర్చు తక్కువ, కిక్కు ఎక్కువ అనే క్యాప్షన్ తో తీసుకొచ్చిన ఈ కొత్త చవకైన మంత్లీ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది. 67 రూపాయలకే నెల రోజులు ఆహా ఓటీటీలో సరికొత్త వెబ్ సిరీస్ లు, సినిమాలు, గేమ్ షోస్, కుకరీ షోస్ ను ఎంజాయ్ చేయవచ్చు. ఆహాలో ఫన్ అండ్ థ్రిల్లింగ్ గేమ్ షో సర్కార్ సీజన్ 5, హోమ్ టౌన్, త్రీ రోజెస్ సీజన్ 2, అప్సర వంటి ఫ్రెష్ ఎంటర్ టైన్ మెంట్ సబ్ స్క్రైబర్స్ కోసం రెడీ అవుతోంది. మీ కోసం కావాల్సినంత క్రియేటివ్ తెలుగు, తమిళ రీజనల్ కంటెంట్ ఆహాలో అందుబాటులో ఉంది. ఉగాది సందర్భంగా అనౌన్స్ చేసిన ఈ అట్రాక్టింగ్ పాకెట్ ప్యాక్ ఆహాకు పెద్ద సంఖ్యలో సబ్ స్క్రైబర్స్ ను జాయిన్ చేయనుంది.

దూరదర్శని నుంచి బ్యూటిఫుల్‌ సాంగ్‌ 'నా నీడ వెళుతుందా' లిరికల్‌ వీడియో విడుదల

Image
సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ జంటగా నటిస్తున్న చిత్రం ’దూరదర్శని’. కార్తికేయ కొమ్మి దర్శకుడు. వారాహ మూవీ మేకర్స్ పతాకంపై బి.సాయి ప్రతాప్ రెడ్డి, జయ శంకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. 1990వ నేపథ్యంలో అందరి హృదయాలను హత్తుకునే ప్రేమకథగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టైటిల్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి 'నా నీడ వెళుతుందా' అనే లిరికల్ వీడియోను విడుదల చేశారు. అనురాగ్‌ కులకర్ణి, సునీత ఆలపించిన ఈ బ్యూటిఫుల్‌సాంగ్‌కు నారాయణ ఆవుల సాహిత్యం అందించారు. ఆనంద్‌ గుర్రాన బాణీలు సమకూర్చారు. దర్శకుడు మాట్లాడుతూ  “ఈ సినిమా అందరిని 90వ దశకంలోకి తీసుకెళ్లి మీ జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తుంది. అందరికి వాళ్ల వాళ్ల ప్రేమకథలు కూడా గుర్తుకు వస్తాయి. తాజాగా విడుదలైన ఈ లిరికల్‌ వీడియో అందరి హృదయాలకు హత్తుకుంటుంది. ప్రేమలోని గాఢతను వర్ణించే ఈ సాంగ్‌ను ప్రముఖ నేపథ్య గాయకులు అనురాగ్‌ కులకర్ణి, సునీత తమ గాత్రంతో ప్రాణం పోశారు. త్వరలోనే విడుదల తేదిని కూడా ప్రకటిస్తాం' అన్నారు. కథానాయకుడు  సువిక్షిత్ మాట్లాడుతూ “19...

యూనిక్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో వస్తున్న "28°C"మూవీ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది - డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్

Image
"పొలిమేర" చిత్రం విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా "28°C" ఏప్రిల్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  ఎమోషనల్ గా సాగే అద్భుతమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర హీరోగా నటించగా..షాలినీ వడ్నికట్టి హీరోయిన్ గా కనిపించనుంది.  "28°C" చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో ఈ మూవీ హైలైట్స్ తెలిపారు డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్. - "28°C" సినిమాతో నాకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఇది మొదటి సినిమా. స్క్రిప్ట్ ను బాగా లవ్ చేశాను. 2017లో స్టార్ట్ చేశాం.  క్వాలిటీ పరంగా రాజీ పడకపోవడంతో బడ్జెట్ పెరిగింది. 2020 మేలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. మార్చి లో లాక్ డౌన్ వచ్చింది. ఆ తర్వాత సినిమాల రిలీజ్ ల పరిస్థితి ఎలా మారిందో మీకు తెలుసు. ఓటీటీకి ఆఫర్స్ వచ్చాయి గానీ మేము సినిమాకు పెట్టిన ఖర్చుకు వారు ఆడిగిన రేట్ కు సంబంధం లేదు. అందుకే మూవీని ఓటీటీకి ఇవ్వలేదు. పైగా మా సినిమాను థియేటర్స్ లో రిల...

"శివ శంభో చిత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఈటెల రాజేంద్ర"

Image
"శివ శంభో చిత్ర యూనిట్ కి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఈటల " "ఏప్రిల్ 18న శివ శంభో చిత్ర విడుదల" అనంత ఆర్ట్స్ పతాకంపై  బొజ్జ రాజగోపాల్, సుగుణ దోరవేటి నిర్మించిన   సంగీత సాహిత్య విలువలు కలిగిన భక్తి ప్రధానమైన చిత్రం *శివ శంభో* ఏప్రిల్ 18 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు ప్రకటించారు.   నర్సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతీయ కళలైన సంగీతం సాహిత్యం నృత్యం ప్రధానాంశాలు గా కలిగిన సందేశాత్మక చిత్రమని ఇటువంటి చిత్రాలను ఉత్తమ అభిరుచి గల ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం తెలంగాణ ప్రజలకు అన్నిరకాల శుభాలను ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అన్నారు. చిత్ర నిర్మాతల్లో ఒకరు, రచయిత, సంగీత దర్శకులు దోరవేటి మాట్లాడుతూ ఉత్తమాభిరుచి గల ప్రేక్షకులు తప్పకుండా తమ చిత్రాన్ని ఆదరిస్తారన్న విశ్వాసం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బొజ్జ రాజగోపాల్, నటులు రమేశ్, బేబీ రిషిత, మేనేజర్ చిట్టి బ...