Posts

"రాజా సాబ్", "హరి హర వీరమల్లు" చిత్రాలతో బ్లాక్ బస్టర్ ఇయర్ 2025 కు వెల్ కమ్ చెప్పబోతున్న బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్

Image
న్యూ ఇయర్ కోసం క్యూరియస్ గా వెయిట్ చేస్తోంది బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్. ఆమె నటించిన రెండు బిగ్ టికెట్ మూవీస్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ తనను ఆడియెన్స్ కు మరింత రీచ్ చేస్తాయని నిధి అగర్వాల్ ఆశిస్తోంది. రాజా సాబ్ సినిమాను మూవీ టీమ్ ఎంతో డెడికేటెడ్ గా రూపొందిస్తున్నారని, ప్రభాస్ తో కలిసి వర్క్ చేయడం మర్చిపోలేనని నిధి చెబుతోంది. అలాగే  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమాలో నటించడం ఎంతో హ్యాపీగా ఉందని తెలిపింది. ఈ రెండు భారీ చిత్రాలతో పాటు తెలుగు, తమిళంలో మరికొన్ని సర్ ప్రైజింగ్ మూవీస్ ను న్యూ ఇయర్ లో అనౌన్స్ చేయనుంది నిధి అగర్వాల్.

బంగారు అయ్యప్ప పాట నక్షత్ర స్టూడియో ద్వారా రిలీజ్

Image
RRR ప్రొడక్షన్స్  నిర్మాణం లో నిర్మితమైన బాలస్వామిని బంగారు అయ్యప్ప పాట నక్షత్ర స్టూడియో ద్వారా రిలీజ్ అయి సోషల్ మీడియా లో 25 మిలియన్స్ పైగా వ్యూస్ తో దూసుకుపోతుంది ఈ సందర్భంగా నక్షత్ర మీడియా ఛైర్మన్ రాజశేఖర్ గారు ఆ పాట రాసిన పరమేశ్ పాటపాడిన చిన్నారి తన్వికి సంగీత దర్శకుడు సత్యదీప్ కొరియోగ్రాఫర్ హరికాంత్ రెడ్డి  ఆ పాటకు నృత్యం చేసిన చిన్నారులకు ఆస్ బెస్టాస్ కాలనీ లోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో చిరుసత్కారం ఏర్పాటు చేసారు ఈ వేడుక కు మాన్లీ స్టార్ జె.డి.చక్రవర్తి గారు అతిధిగా విచ్చేసి లిరిక్ రైటర్ సంగీత దర్శకుడికి  పాట పాడిన చిన్నారిని నర్తించిన చిన్నారులను కొరియోగ్రాఫర్ ను మిగతా టెక్నిషియన్స్ అందరిని నక్షత్ర టీమ్ వారిని జ్ఞాపికలతో సత్కరించారు తరువాత  జె.డి చక్రవర్తి మాట్లాడుతూ ఇలా మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి  ఎంకరేజ్ చేస్తూ వారికంటూ ఓ ప్లాట్ పామ్ క్రియేట్ చేసినందుకు నక్షత్ర మీడియా అధినేత రాజశేఖర్ గారికి యాంకర్ గంగకు మనస్ఫుర్తిగా అభినందనలు తెలియజేస్తూ  పాటను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు... ఈ పాటకు కెమరామెన్ . సత్య సతీష్, ఎడిటర్...

విడుదలకు సిద్ధమైన అమ్మ రాజశేఖర్ ‘తల’

Image
దర్శకుడు అమ్మ రాజశేఖర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తల’. ఈ చిత్రంతో ఆయన తన కుమారుడు అమ్మ రాగిన్‌రాజ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. సూపర్‌ గుడ్‌ ఫిల్మ్‌ సమర్పణలో ఎన్‌వీ ప్రసాద్‌, వాకాడ అంజన్‌కుమార్‌ నిర్మిస్తున్నారు.  ఈ సినిమాలో అమ్మ రాగిన్ రాజ్, రోహిత్, ఎస్తేర్ నొరొన్హ, ముక్కు అవినాష్, సత్యం రాజేశ్, అజయ్, రాజీవ్ కనకాల, ఇంద్రజ.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న థియేటర్స్ లో విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.  ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి స్పందన లభించింది. శ్యామ్‌ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు  తమన్‌, ఎస్‌.అస్లాం కేయి ధర్మతేజ సంగీతం అందించారు కథ, కొరియోగ్రఫీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అమ్మ రాజశేఖర్‌.

2024 లో తెలంగాణ బేస్డ్ బెస్ట్ తెలుగు ఫిలిమ్స్

Image
2024 సంవత్సరంలో  తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తెలంగాణ నేపధ్యంలో చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. పెద్ద హీరోల సినిమాల నుంచి  ఊహించని హిట్ల వరకు వైవిధ్యభరితమైన చిత్రాలను ప్రేక్షకులు చూసారు. కొన్ని సినిమాలు అంచనాలను అందుకోవడంలో విఫలమైనా, మరి కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాయి. 2024లో తెలంగాణ యాసలో తెరపైకి వచ్చిన చెప్పుకోదగ్గ సినిమాలను నిశితంగా పరిశీలిస్తే  స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన "టిల్లు స్క్వెర్"100కోట్ల క్లబ్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. అలాగే  హైదరాబాద్ సంస్థానంలో 1940లలో తెలంగాణ ప్రాంతంలో రజాకార్ వ్యవస్థపై జరిగిన అరాచకాల మీద వచ్చిన "రజాకార్" మొదటి షో నుండే మంచి టాక్ తో మంచి కలెక్షన్లు రాబట్టుకుంది. తెలంగాణ పెళ్లి నేపధ్యంలో వచ్చిన "లగ్గం" థియేటర్లల్లో డీసెంట్ హిట్టుగా నిలిచి ఎమోహనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచింది. డిఫెరెంట్ స్టయిల్ ప్రమోషన్స్ తో ప్రజల్లోకి వెళ్లిన "పొట్టేలు" పర్వాలేదు అనిపించింది.  జితేందర్ రెడ్డి ,ఉరుకుపటెలా , లైన్ మాన్ , ప్రవీణ్ IPS , కళ్ళు కాంపౌండ్ ,పైలం పిలగా, ష...

జ‌న‌వ‌రి 1న ‘గేమ్ చేంజర్’ ట్రైల‌ర్ రిలీజ్.. గ్లోబ‌ల్‌స్టార్ రామ్ చరణ్ నట విశ్వరూపం చూడబోతోన్నారు: విజయవాడలో భారీ కటౌట్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు

Image
గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను  శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు ఆర్‌సీ యువశక్తి ఆధ్వర్యంలో విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్‌ను ఆవిష్కరించారు. 256 అడుగుల ఎత్తైన ఈ కటౌట్ లాంచ్ ఈవెంట్‌కు దిల్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ ట్రైలర్ నా ఫోన్‌లో ఉంది. కానీ అది మీ (ఆడియెన్స్) వద్దకు రావాలంటే ఇంకా మేం చాలా పని చేయాల్సి ఉంది. ఇప్పుడు ట్రైలర్‌లే సినిమా స్థాయిని నిర్ణయిస్తున్నాయి. అందుకే ఈ ట్రైలర్‌ను కొత్త ఏడాది సందర్భంగా అంటే జనవరి 1న మీ ముందుకు తీసుకు వస్తున్నాం. సినిమా అంటేనే విజయవాడ. ఇక్కడ రామ్ చరణ్ భారీ కటౌట్‌ను రివీల్ చేయ...

'ఓ తండ్రి తీర్పు' చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తోంది: డాక్టర్ కె.వి. రమణాచారి !!!

Image
ఏవికె ఫిలిమ్స్ బ్యానర్ పై లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సమర్పణలో లయన్ శ్రీరామ్ దత్తి నిర్మాతగా, రాజేంద్ర రాజు కాంచనపల్లి రచన దర్శకత్వ పర్యవేక్షణలో ప్రతాప్ భీమవరపు దర్శకత్వంలో వివ రెడ్డి హీరోగా ‘ఓ తండ్రి తీర్పు’  సినిమా ఈ నెల 27న విడుదలై మాంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా వివ రెడ్డి హీరోగా పరిచయం అయ్యారు. ప్రతాప్ భీమవరుపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు రచన పర్యవేక్షణ రాజేంద్రరాజు  కాంచనపల్లి. సినిమా విజయవంతంగా ప్రదర్షింపబడుతున్న చిత్ర యూనిట్ మీడియా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కెవి.రమణాచారి మాట్లాడుతూ... కుటుంబ విలువలతో ఓ తండ్రి తీర్పు సినిమాను నిర్మించారు. తల్లిదండ్రుల ఆస్తులపై ఉన్న ప్రేమ తల్లిదండ్రులపై లేకపోవటం ఎంతటి మానసిక క్షోభకు గురిచేస్తుందో ఇతివృత్తంగా ఈ సినిమా ఉందని ప్రసంశలు వస్తున్నాయి, ఓ తండ్రి తీర్పు కొడుకుగా వివ రెడ్డి చేసిన ప్రధానమైన పాత్ర చాలామంది కొడుకులకు కనువిప్పు కలిగించేదిగా ఉందని అంటున్నారు. మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఓ తండ్రి తీర్పు తో మరోసారి నిరూపణ అయ్యింది, చక్కటి మెసేజ్ ఈ సినిమాలో ఉందని, ప్రతి కుటుంభం ఈ స...

మార్కో మానియా దేశాన్ని పట్టుకుంది: భారతదేశంలోని అత్యంత హింసాత్మక చిత్రం కేవలం 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹50 కోట్ల కలెక్షన్‌ను వేగంగా దాటింది! మలయాళంలో తొలిసారి

Image
 అత్యంత హింసాత్మకమైనది, అత్యంత స్టైలిష్‌గా, మరపురానిది!  మార్కో భారతీయ సినిమాని తుఫానుగా తీసుకుంది!  ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన యాక్షన్ థ్రిల్లర్ అయిన మార్కో, బాక్సాఫీస్ వద్ద తుఫానుతో రికార్డులను బద్దలు కొట్టింది మరియు మలయాళ సినిమా ప్రమాణాలను పునర్నిర్వచించింది.  సూపర్ స్టార్ ఉన్ని ముకుందన్ నటించిన మార్కో క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మించారు.  హనీఫ్ అదేని దర్శకత్వం వహించారు   ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ₹10.8 కోట్లను వసూలు చేసింది, ఇది మలయాళ చిత్రానికి అత్యధిక ఓపెనింగ్ రికార్డులలో ఒకటిగా నిలిచింది.  క్రిటిక్స్ ఈ చిత్రం గ్రిప్పింగ్ ఎగ్జిక్యూషన్ మరియు ఉన్ని ముకుందన్ యొక్క అయస్కాంత ఉనికిని ప్రశంసించారు.  రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, చంద్రు సెల్వరాజ్ సినిమాటోగ్రఫీ, షమీర్ మహమ్మద్ ఎడిటింగ్‌లో ఉన్ని ముకుందన్, యుక్తి తరేజా, సిద్ధిక్, జగదీష్, అన్సన్ పాల్ మరియు రాహుల్ దేవ్‌లతో సహా ఒక నక్షత్ర తారాగణం కలిసి ఈ చిత్రం యొక్క సాంకేతిక నైపుణ్యం స్పష్టంగా కనిపిస్తుంది.  చిత్ర హింస-భారీ కథనం, ...