డైరెక్టర్ బుచ్చిబాబు సానా చేతులమీదుగా బ్యాడ్ గాళ్స్ (కానీ చాలా మంచోళ్లు) చిత్రం టీజర్ విడుదల.
ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య ముఖ్య తారాగణం తో ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో వస్తున్న మరో ఎంటర్టైనర్ చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రం క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది. అయితే ఈ రోజు రామ్ చరణ్ పెద్ది చిత్ర దర్శకుడు బుచ్చి బాబు సానా ఈ చిత్రం యొక్క టీజర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా... పెద్ది చిత్ర దర్శకుడు బుచ్చి బాబు సానా మాట్లాడుతూ "ఈ బ్యాడ్ గాళ్స్ చిత్ర కథ నాకు మున్నా గారు చెప్పారు, కథ చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. దర్శకుడు సుకుమార్ గారి దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నప్పుడు మున్నా సుకుమార్ గారి దగ్గరకు వచ్చేవాడు, సుకుమార్ గారికి తాను రాసుకున్న కథలు చేపి ఆయనతో ఓకే చేయించుకునేవారు. మున్నా డైరె...