రొమాంటిక్ కామెడీ-థ్రిల్లర్ "మైనే ప్యార్ కియా" ఆగస్ట్ 29న థియేటర్స్ లో విడుదల !!!
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మలయాళ చిత్రం మైనే ప్యార్ కియా ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ ఇటీవల అధికారికంగా ఆవిష్కరించింది, ఇది రొమాన్స్, కామెడీ మరియు సస్పెన్స్‌లతో కూడిన థ్రిల్లర్, ఫన్నీ ఎలిమెంట్స్ తో కూడిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మరియు రచయిత ఫైజల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని స్పైర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంజు ఉన్నితన్ నిర్మించారు, ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ మందాకిని తర్వాత కంపెనీ యొక్క నాల్గవ ప్రధాన వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రిచ్ మేకింగ్ వాల్యూస్ తో ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందించబడింది. ప్రేక్షకులకు ఎంగేజింగ్ గా ఫీల్ అయ్యే అంశాలు ఈ సినిమాలో చాలా ఉండబోతున్నాయి. హీరో, హీరోయిన్ హృదు హరూన్ మరియు ప్రీతి ముకుందన్ రిలీజ్ పోస్టర్ లో డిఫరెంట్ లుక్ కనిపిస్తున్నారు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా పోస్టర్ లో ఒక ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. పోస్టర్ చూస్తుంటే సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. ఒక లవ్ స్టోరీలో ఉండాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. ఆగస్ట్ 29న థియేటర్లలో విడుదల కానున్న మైనే ప్యార్ కియా ఒక రొమాంటిక్ కామెడీ-థ్రిల్లర్‌గా నిల...