దళపతి విజయ్ బర్త్ డే సందర్భంగా ‘జన నాయకుడు’ మూవీ నుంచి ఫస్ట్ రోర్ రిలీజ్
దళపతి విజయ్ నటిస్తోన్న ‘జన నాయకుడు’ చిత్రాన్ని హిస్టారికల్ మూవీగా అందరూ అభివర్ణిస్తున్నారు. అందుకు కారణం ఆయన నటిస్తోన్న చివరి చిత్రమిది. దళపతి విజయ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ‘ఫస్ట్ రోర్’ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇప్పుడీ గ్లింప్స్ ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆయన చివరి చిత్రం కావటంతో ఈ లెజెండ్రీకి వీడ్కోలు పలకటానికి బీజం చేసినట్లు గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతుంది. 65 సెకన్ల వ్యవధి ఉన్న ‘జన నాయకుడు’ ఫస్ట్ రోర్ వీడియోను గమనిస్తే, ‘నా హృదయంలో ఉండే..’ అనే మాటలు విజయ్ వాయిస్‌లో మనకు వినిపిస్తాయి. పోలీస్ డ్రెస్‌లో లాఠీ పట్టుకుని యుద్ధ వాతావరణాన్ని తలపించే ప్రదేశంలో నడుస్తూ వస్తుంటారు. ఈ విజువల్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. శక్తి, శాంతి, గంభీరతను కలగలిపేలా ఉన్న ఈ సన్నివేశం చూస్తుంటే జన నాయగన్ మూవీ దళపతి విజయ్‌కి సాధారణ వీడ్కోలు కాబోదనే సంకేతాన్ని స్పష్టంగా ఇస్తోంది. ఫస్ట్ రోర్ వీడియోతో పాటు విడుదలైన బర్త్ డే పోస్టర్ మరింతగా మెప్పిస్తోంది. పెద్ద సింహాససనం మీద దళ...