Posts

ఈ నెల 13న వస్తోన్న నిజం

Image
హరి ఓం కనెక్ట్స్ పతాకం పై రామ్స్ కట్ సమర్పణ లో సాయికుమార్, పోసాని కృష్ణ మురళీ, నాగబాబు ప్రధాన పాత్రల్లో కిశోర్ వెన్నెలకంటి దర్శకత్వంలో జానకి రామారావు పామరాజు నిర్మించిన చిత్రం " నిజం". ఈ చిత్రం ఈ నెల 13న గ్రాండ్ గా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత జానకి రామారావు పామరాజు మాట్లాడుతూ..."దర్శకుడు కిషోర్ వెన్నెలకంటి గారు ఒక విభిన్నమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  సాయి కుమార్, పోసాని , నాగబాబు గారి పాత్రలు సినిమాకు కీలకంగా ఉంటాయి. అలాగే మ్యూజిక్ తో పాటు స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ నెల 13న సినిమాను గ్రాండ్ గా విడుదల చేస్తాం "అన్నారు.  ఈ చిత్రానికి దర్శకుడు: కిషోర్ వెన్నెలకంటి; నిర్మాత: జానకి రామారావు పామరాజు ; సంగీతం: సి. కృష్ణ; పాటలు: సురేశ్ గంగుల; కెమెరా: జీవి ప్రసాద్; ఎడిటర్: జేపీ; PRO: రమేష్ చందు.

సూర్య, వెంకీ అట్లూరి కలయికలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #Suriya46 షూటింగ్ ప్రారంభం

Image
వైవిధ్యమైన పాత్రలు, చిత్రాలతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన తమిళ అగ్ర కథానాయకుడు సూర్య, తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నారు. సూర్య 46వ చిత్రంగా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక ద్విభాషా చిత్ర షూటింగ్ ను నేడు ప్రారంభించారు. ప్రతిభావంతులు సూర్య, వెంకీ అట్లూరి మొదటిసారి చేతులు కలపడంతో.. కేవలం ప్రకటనతోనే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అందరి ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా "వేడుక, భావోద్వేగం మరియు వినోదం వైపు తొలి అడుగు" అంటూ సూర్య ముందుకి అడుగు వేస్తున్న అద్భుతమైన పోస్టర్‌ ను చిత్ర బృందం పంచుకుంది. తమిళ కథానాయకుడు అయినప్పటికీ పలు సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకుల ప్రేమను కూడా పొందుతున్న సూర్య.. ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం.33 తో ...

Mithra Mandali Title Announcement Garners Massive Response – Teaser Launch on June 12th at 12:00 PM!

Image
The recently revealed Title Announcement Motion Poster of Mithra Mandali has taken the internet by storm, receiving a phenomenal response from the audience. With quirky character glimpses, intriguing visuals,leaving viewers curious and excited, the announcement has sparked a wave of anticipation across social media. Presented by Bunny Vas under the banner of BV Works, & Produced by Sapta Aswa Media Works and Vyra Entertainments, Mithra Mandali promises a unique blend of humour, mystery, and youthful madness. The film, directed by Vijayendar, features an eccentric gang of actors – Priyadarshi, Niharika N M, Vishnu Oi, Rag Mayur, and Prasad Behara, whose energy and comic timing is well celebrated amongst the audience. The film is Produced by Kalyan Manthina, Bhanu Pratapa, and Dr. Vijender Reddy Teegala & Co-produced by Somaraju Penmetsa. With the motion poster capturing amazing reach & attention, the makers have officially announced the Teaser Launch on June 12th...

యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న ‘సయారా’ నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ ‘బర్బాద్’ విడుదల

Image
యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న న్యూ ఏజ్ లవ్ స్టోరీ ‘సయారా’. ఈ మూవీతో అహాన్ పాండే తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో అనీత్ పద్దా హీరోయిన్‌గా నటిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘సయారా’ టీజర్, టైటిల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. ఇదొక న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని, నేటి ట్రెండ్‌కి, యూత్‌ని అద్దం పట్టేలా ఉందని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. తాజాగా సయారా నుంచి రెండో పాటను రిలీజ్ చేశారు. ‘బర్బాద్’ అంటూ  సాగే ఈ పాటను యంగ్ సెన్సేషణ్ జుబిన్ ఆలపించారు.  ఈ పాటకు ది రిష్ సాహిత్యాన్ని అందించడమే కాకుండా బాణీని సమకూర్చారు. ఇక ఈ రొమాంటిక్ లవ్ సాంగ్ కోసం జుబిన్‌ను ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఉందని దర్శకుడు మోహిత్ తెలిపారు. ఈ మేరకు మోహిత్ మాట్లాడుతూ.. ‘ప్రేమ పాటల్ని పాడేందుకు ప్రతీ తరంలో ఓ గాయకుడు పుట్టుకొస్తారు. ఈ తరానికి జుబిన్ అలాంటి ఓ గ్రేట్ సింగర్. సయారా ఆల్బమ్‌లో జుబిన్ ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ ట్రాక్ పాడాలని నేను అనుకున్నాను. నేను బర్బాద్‌ ట్యూన్ విన్నప్పుడు జుబిన్ గాత్రం సరిగ్గా సరిపోతుందని భావించాను. జుబిన్ స్వరం చాలా ప్రత్యేకమైనది. జుబిన్ పాట పాడితే ...

యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న ‘సయారా’ నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ ‘బర్బాద్’ విడుదల

యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న న్యూ ఏజ్ లవ్ స్టోరీ ‘సయారా’. ఈ మూవీతో అహాన్ పాండే తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో అనీత్ పద్దా హీరోయిన్‌గా నటిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘సయారా’ టీజర్, టైటిల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. ఇదొక న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని, నేటి ట్రెండ్‌కి, యూత్‌ని అద్దం పట్టేలా ఉందని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. తాజాగా సయారా నుంచి రెండో పాటను రిలీజ్ చేశారు. ‘బర్బాద్’ అంటూ  సాగే ఈ పాటను యంగ్ సెన్సేషణ్ జుబిన్ ఆలపించారు.  ఈ పాటకు ది రిష్ సాహిత్యాన్ని అందించడమే కాకుండా బాణీని సమకూర్చారు. ఇక ఈ రొమాంటిక్ లవ్ సాంగ్ కోసం జుబిన్‌ను ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఉందని దర్శకుడు మోహిత్ తెలిపారు. ఈ మేరకు మోహిత్ మాట్లాడుతూ.. ‘ప్రేమ పాటల్ని పాడేందుకు ప్రతీ తరంలో ఓ గాయకుడు పుట్టుకొస్తారు. ఈ తరానికి జుబిన్ అలాంటి ఓ గ్రేట్ సింగర్. సయారా ఆల్బమ్‌లో జుబిన్ ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ ట్రాక్ పాడాలని నేను అనుకున్నాను. నేను బర్బాద్‌ ట్యూన్ విన్నప్పుడు జుబిన్ గాత్రం సరిగ్గా సరిపోతుందని భావించాను. జుబిన్ స్వరం చాలా ప్రత్యేకమైనది. జుబిన్ పాట పాడితే వాటికి లైఫ్ ...