ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చరిత్ర లో రాని నిజ జీవితాల కథనాలతో ‘గేమ్ అఫ్ చేంజ్’! మే 14న అన్ని భాషల్లో చాలా గ్రాండ్ రిలీజ్!!
5వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో భారతదేశంలో జరిగిన కొన్ని చరిత్ర లో రాని నిజజీవితాల కథనాలతో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో వస్తున్న చిత్రం ‘గేమ్ అఫ్ చేంజ్’. జాతీయ, అంతర్జాతీయ నటి నటులతో సిద్ధార్థ్ రాజశేఖర్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మలయాళ దర్శకుడు సిధిన్ దర్శకత్వంలో సిద్ధార్థ్ రాజశేఖర్, మీనా చాబ్రియా నిర్మించిన అంతర్జాతీయ చిత్రం ‘గేమ్ అఫ్ చేంజ్’. ఈ చిత్రం ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక సినిమా మే 14న అన్ని భాషల్లో చాలా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు సిధిన్ మాట్లాడుతూ ‘‘ఇక్కడ సాధారణ క్షణాలు అసాధారణమైన జీవన మలుపులుగా మారతాయి. ‘గేమ్ ఆఫ్ చేంజ్’ అనే సినిమా ఒక శక్తివంతమైన జీవన విధానాన్ని తీర్చిదిద్దే అస్త్రం వంటిది. సాధారణమైన క్షణాలు అసాధారణమైన మార్పులను రేకెత్తించిన పలు వ్యక్తుల ఆకర్షణీయమైన వ్యక్తిగత నిజ జీవిత కథనాలను మిళితం చేసి రూపొందించిన చిత్రమిది. భారతదేశ చరిత్రలో కుమార గుప్తుడు శా.శ 427లో నిర్మించిన నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగిన కొన...