Posts

బ్రహ్మానందంపై నిర్మాత ఎస్ కేఎన్ స్పీచ్ కు ప్రశంసలు

Image
అత్యధిక చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న హాస్య బ్రహ్మ బ్రహ్మానందం చిరకాలం మనల్ని నవ్విస్తూనే ఉండాలని అన్నారు ప్రముఖ నిర్మాత ఎస్ కేఎన్. మహా కుంభమేళాలో 150 ఏళ్ల వయసున్న సాధువులను చూశామని, బ్రహ్మానందం కూడా అలా తరతరాలు నవ్వులు పంచాలని ఎస్ కేఎన్ కోరారు. సప్తగిరి లీడ్ రోల్ చేసిన పెళ్లికాని ప్రసాద్ సినిమా ఈవెంట్ లో అతిథిగా పాల్గొన్నారు ఎస్ కేఎన్.  ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం గురించి నిర్మాత ఎస్ కేఎన్ ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఒక దిగ్గజ హాస్య నటుడిని గౌరవిస్తూ ఎస్ కేఎన్ మాట్లాడిన మాటలు ప్రేక్షకులను కదిలిస్తున్నాయి. ఎస్ కేఎన్ స్పీచ్ ను పలువురు ప్రశంసిస్తున్నారు. లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు బ్యాక్ బోన్ గా నిలిచారని చెప్పారు ఎస్ కేఎన్.  బ్రహ్మానందం గారి వీడియో చూడనిదే మాకు రోజు గడవదని,  ఆయన తన కామెడీతో మనకు స్ట్రెస్ బస్టర్ అయ్యారని ఎస్ కేఎన్ అన్నారు.  తన గురించి హార్ట్ టచింగ్ గా మాట్లాడిన ఎస్ కేఎన్ కు కృతజ్ఞతలు తెలిపారు బ్రహ్మానందం. ఎస్ కేఎన్ గుండెల్లో నుంచి ఆ మాటలు చెప్పారని, ఇలాంటి వాళ్ల అభిమానం ఉన...

'శారీ' సినిమా చూశాక అమ్మాయిలు సోషల్ మీడియా పట్ల జాగ్రత్త పడతారు - థియేటర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ

Image
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా 'శారీ'.  ఈ చిత్రంలో సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు గిరి కృష్ణ కమల్ రూపొందించారు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. 'శారీ' సినిమా ఏప్రిల్ 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ రోజు హైదరాబాద్ లో 'శారీ' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ - మనం ఎవరితోనైనా డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు పెద్దగా వారితో కనెక్ట్ కాము. కానీ వాట్సాప్ లాంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా మాట్లాడుకున్నప్పుడు మనం వారిని నేరుగా చూడటం లేదు గనుక త్వరగా వారితో కలిసిపోతాం. మన వ్యక్తిగతమైన విషయాలు కూడా చెప్పేస్తుంటాం. ఒక్కసారి ఎదుటివారికి దగ్గరయ్యాక భయం వల్లో సైకలాజికల్ ఫీలింగ్ వల్లో మరింతగా అటాచ్ అవుతాం. ఇలా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం వల్ల ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిఉంటుంది. 'శారీ' సినిమా నే...

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో "దీక్ష" త్వరలో విడుదల.

Image
ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్ లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, స్వీయ దర్శకత్వంలో   కిరణ్, ఆలేఖ్యరెడ్డి హీరో హీరోయిన్స్ గా ఆక్స ఖాన్, తులసి, అనూష,ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం"దీక్ష". లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఒక వ్యక్తి దీక్ష, పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనే పాయింట్ ను ఇతివృత్తంగా తీసుకుని లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. చాలా అందమైన లొకేషన్స్ లో, చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పాటలు అద్భుతంగా వచ్చాయి. మా బ్యానర్ కు మంచి పేరు తెచ్చే చిత్రం అవుతుంది. లవ్ యాక్షన్ తో పాటు మైథలాజికల్ ను జోడించి నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరో కిరణ్ భీముడు పాత్రలో అద్భుతమైన నటన కనపరచాడు. మా చిత్రం ద్వారా హీరో కిరణ్ కి మంచి పేరు, గుర్తింపు వస్తాయి. ఆక్స ఖాన్ స్పెషల్ సాంగ్ లో, తనదైన శైలిలో డాన్స్ ఆదరగొట్టింది. మా చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు అందరూ ఎంతో దీక్షతో పనిచేసా...

Writer Chandrabose praises 'Maathru' film songs !!!

Image
 All the films with Mother Sentiment have achieved blockbuster success at the box-office so far.  From Maathru Athidi Devo Bhava to Bicchagadu, many have become cult classics.  Now a film is coming with this mother sentiment. In the presence of Sri Padma under the banner of Sri Padmini Cinemas.  'Maathru' is a film produced by Siva Prasad.  Directed by John Zakky, the film stars Sriram, Nandini Roy, Sugi Vijay and Rupali Bhushan in pivotal roles.   The shooting of this movie has been completed.  The film unit is ready to release soon.  In this order, the promotion has increased.  An emotional song has been released with a mother sentiment that matches the title Maathru.  Dinesh Rudra sang this song called "Aparanji Bomma.. MaAmma.. Producer B.  Siva Prasad has provided the lyrics.  Shekhar Chandra Bani is heart touching.  This song is currently trending on YouTube.  Speaking on the occasion, writer Ch...

తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూత‌న కార్య‌వ‌ర్గం ప్ర‌మాణ‌స్వీకారం

Image
▪ *అధ్య‌క్షుడిగా రమణ వంక బాధ్య‌త‌లు* ▪ *ముఖ్య అతిథిగా  తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు* ▪ *అభినంద‌న‌లు తెలిపిన డైరెక్ట‌ర్లు మారుతి, హ‌రీష్ శంక‌ర్*    తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కొలువుదీరింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జ‌రిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్ర‌ముఖ నిర్మాత‌, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని నూత‌న కార్యవ‌ర్గాన్ని స‌న్మానించారు. తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ అసోసియేషన్ ఎన్నిక‌ల్లో అధ్య‌క్షుడిగా రమణ వంక, ప్రధాన కార్యదర్శిగా  కెఎం రాజీవ్ నాయర్, కోశాధికారిగా ఎం తిరుపతి, ఇత‌ర పాల‌క స‌భ్యులు ఈ సంద‌ర్భంగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. ''తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూత‌న కార్య‌వ‌ర్గానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆర్ట్ డైరెక్టర్స్ నిర్మాతల బాధ్య‌త‌ల‌ గురించి ఆలోచించాల‌ని, క‌లిసి క‌ట్టుగా ముందుకు వెళదాం'' అని చెప్పారు.   తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ నూత‌న అధ్య‌క్షుడు రమణ వం...

"కాలమేగా కరిగింది" మూవీకి దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రశంసలు దక్కడం సంతోషంగా ఉంది, మోస్ట్ పొయెటిక్ లవ్ స్టోరీ మూవీగా "కాలమేగా కరిగింది" మీ ఆదరణ పొందుతుంది - ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు శింగర మోహన్

Image
వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. శింగర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. పొయెటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన "కాలమేగా కరిగింది" సినిమా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ మాట్లాడుతూ - "కాలమేగా కరిగింది" తెలుగుదనం ఉన్న మంచి సినిమా. అంతా కొత్త వాళ్లే ఈ సినిమా చేసినా అనుభవం ఉన్నవారిలా క్వాలిటీ సినిమా రూపొందించారు. పాటలు చాలా బాగున్నాయి. మా ఆదిత్య నుంచి వీలైనంతగా ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్నాం. అన్నారు. డీవోపీ వినీతి పబ్బతి మాట్లాడుతూ - చిన్న చిత్రాలకు ఎదురయ్యే ఇబ్బందులు మా "కాలమేగా కరిగింది" సినిమాకు కూడా చూశాం. అవన్నీ దాటుకుని ఇప్పుడు మూవీని రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మా టీమ్ లో దాదాపు అందరం స్నేహితులమే. మా సినిమాను థియేటర్స్ లో...

డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ గా "కిల్లర్ ఆర్టిస్ట్" సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది - ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

Image
సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న సినిమా "కిల్లర్ ఆర్టిస్ట్". ఈ సినిమాను ఎస్ జేకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్నారు. "కిల్లర్ ఆర్టిస్ట్" మూవీ ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. నైజాం ఏరియాలో ఈ సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తుండటం విశేషం. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లిరిసిస్ట్ రాంబాబు గోసాల మాట్లాడుతూ - "కిల్లర్ ఆర్టిస్ట్" మూవీ ఈ నెల 21న రిలీజ్ అవుతోంది. మీరంతా సినిమా చూసి పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నా. ఈ చిత్రంలో మూడు పాటలు రాశాను. లవ్ సాంగ్స్ తో పాటు బ్రేకప్ సాంగ్ ఉంటుంది. సాంగ్స్ కు మంచి లిరిక్స్ కుదిరాయి. సురేష్ బొబ్బిలి గారు హిట్ ట్యూన్స్ ఇచ్చారు. పాటలకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. అన్నారు. ఎడిటర్ ఆర్ఎం విశ్వనాథ్ కుచనపల్లి - "కిల్లర్ ఆర్టిస్ట్" మూవీ ఎడిటర్ గా నాకు మంచి అవకాశం అని భావిస్తున్నా. స్క్రీన్...