ఉషాపరిణయం సెట్‌ను సందర్శించి టీమ్‌కు ఆల్‌దబెస్ట్ చెప్పిన స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్
ఉషా పరిణయం షూటింగ్ పూర్తి
తెలుగు సినీ రంగంలో దర్శకుడిగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న దర్శకుల్లో ఒకరైన కె.విజయ్‌భాస్కర్ మళ్లీ ఓ సరికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. నువ్వేకావాలి, మన్మథుడు, మల్లీశ్వరి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన స్వీయ దర్శకత్వంలో ఉషా పరిణయం బ్యూటిఫుల్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక. విజయ్‌భాస్కర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ పతాకంపైకె.విజయ్‌భాస్కర్ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో విజయ్‌భాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా నటిస్తుండగా, తాన్వీ ఆకాంక్ష అనే అచ్చతెలుగమ్మాయి ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది. గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఐటెమ్‌సాంగ్‌ను హీరో శ్రీకమల్, ప్రముఖ కథానాయిక సీరత్‌కపూర్‌పై చిత్రీకరిస్తున్నారు. ఘల్లు.. ఘల్లు అనే ఈ సాంగ్‌కు విజయ్ పొల్లంకి కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఆర్.ఆర్. ధ్రువన్ సంగీతం అందించారు. అయితే ఈ సాంగ్ చివరి రోజు, చిత్రీకరణకు చివరి రోజు శుక్రవారం ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న సెట్‌కు స్టార్ రైటర్ అండ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విచ్చేసి టీమ్‌కు ఆల్ దబెస్ట్ చెప్పారు. త్రివిక్రమ్, విజయ్‌భాస్కర్ కలయికలో ఎన్ని సూపర్‌హిట్ సినిమాలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సూపర్‌హిట్ కాంబినేషన్ చాలా రోజుల తరువాత కలవడం కూడా ఒక శుభసూచకం అని చెప్పాలి. ఈ ఐటమ్ సాంగ్ చిత్రీకరణతో షూటింగ్ పూర్తయినట్లుగా మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం వుంది* అనే నమ్మకం వుందని చిత్రమేకర్స్ తెలియజేశారు.
శ్రీకమల్, తాన్వి ఆకాంక్ష, సూర్య, రవి, శివతేజ, అలీ, వెన్నెలకిషోర్, శివాజీ రాజా, ఆమని, సుధ, ఆనంద్ చక్రపాణి, రజిత, బాలక్రిష్ణ, సూర్య, మధుమణి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకి సంగీతం : ఆర్ ఆర్ ధ్రువన్, డీఓపీ: సతీష్ ముత్యాల, ఎడిటింగ్: ఎమ్ ఆర్ వర్మ, దర్శకత్వం-నిర్మాత :కె.విజయ్‌భాస్కర్
Comments
Post a Comment