Posts

జూన్ 14న వస్తున్న "రాజధాని రౌడీ".

Image
సంతోష్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సంతోష్ కుమార్ నిర్మాణంలో, సంచలన విజయం సాధించిన కెజియఫ్ ఫేమ్ యశ్ హీరోగా, షీనా హీరోయిన్ గా, కె.వి రాజు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం" రాజధాని రౌడీ". ఈ చిత్రం జూన్ 14న విడుదల కు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత సంతోష్ కుమార్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు, మద్యపానం బారినపడి, నలుగురు యువకులు తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకున్నారు అనే కధాంశంతో తెరకెక్కిన చిత్రం "రాజధాని రౌడీ". వినోదానికి, సందేశాన్ని జోడించి రూపొందిన చిత్రమిది. చెడు పరిణామాలను ఎత్తి చూపుతూ, ఆలోచన రేకెత్తించే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీస్ గా అద్భుతమైన నటన ప్రదర్శించారు. ముమైత్ ఖాన్ తన అందాలతో కనువిందుచేస్తారు. అర్జున్ జన్య అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇలాంటి మంచి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది.  అత్యధిక థియేటర్లలో ఈనెల 14న విడుదల చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులందరు ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

సెన్సేషనల్ డైరెక్టర్ గుణ శేఖ‌ర్ యూత్‌ఫుల్ సోష‌ల్ డ్రామా ‘యుఫోరియా’ చిత్రానికి సంగీత దర్శ‌కుడిగా కాల భైర‌వ‌.. స్పెష‌ల్ వీడియో రిలీజ్ చేసిన టీమ్‌

Image
కాల భైర‌వ‌.. భార‌త‌దేశానికి ఆస్కార్ సాధించి పెట్టిన ‘నాటు నాటు ..’ పాటను పాడి ఆస్కార్ వేదిక‌ను ఓ ఊపు ఊపారు. ఆయ‌న‌ ఓ వైపు సింగ‌ర్‌గా, మ‌రో వైపు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ యంగ్ మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగ‌మ‌య్యారు. ఆ క్రేజీ సినిమాయే ‘యుఫోరియా’. వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్ష‌న్‌లో ‘యుఫోరియా’ అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే.  ‘యుఫోరియా’కు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా కాల‌భైర‌వ టీమ్‌తో జాయిన్ అవుతున్నారంటూ ఓ స్పెష‌ల్ వీడియో ద్వారా అనౌన్స్ చేసింది. గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్  బ్యాన‌ర్‌పై నీలిమ గుణ నిర్మాత‌గా ఈ చిత్రం రూపొందనుంది. ఈసినిమాలో న‌టించబోయే న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని  టీమ్ తెలియ‌జేసింది.

Bobby Kolli, Sithara Entertainments' release special birthday glimpse from of Nandamuri Balakrishna from NBK109

Image
Nandamuri Balakrishna commands Telugu Cinema as "Natural Born King" - NBK, the "God of Masses" and his recent form has been the big talk of the town. He is delivering some memorable characters and huge theatrical blockbusters. Now, he is gearing up to entertain masses with NBK109 in the direction of super successful writer-director Bobby Kolli.  Sithara Entertainments, one of the busiest and most successful production houses of Telugu Cinema, is producing the film on a lavish canvas. The makers have unveiled a special birthday glimpse to introduce the character of Nandamuri Balakrishna, "A Monster that even Evil would fear".  Already, they released an important glimpse giving us a sneak peek into the world of NBK109 and now, they have introduced the character with a hint about his dangerous mission.  Bobby Kolli has carved a niche for himself in making thundering action blockbuster movies with big stars. Going by the two glimpses released by th

ఘనంగా ప్రారంభమైనసిల్వర్‌స్క్రీన్‌ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి ప్రొడక్షన్‌ నెం.1

Image
యువ కథానాయకుడు అవినాష్‌ తిరువీధుల, సిమ్రాన్‌ చౌదరి జంటగా సిల్వర్‌స్క్రీన్‌ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ప్రముఖ రచయిత సాయిమాధవ్‌ బుర్రా స్క్రిప్ట్‌ సూపర్‌విజన్‌`డైలాగ్స్‌తో కార్తి దర్శకత్వంలో శాంతనూపతి, ఆలపాటిరాజా, అవినాష్‌బుయాని, అంకిత్‌రెడ్డిలు నిర్మిస్తున్న ‘ప్రొడక్షన్‌నెం.1’ చిత్రం హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. హీరో, హీరోయిన్‌లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, ప్రముఖ దర్శకుడు బాబీ ఫస్ట్‌షాట్‌కు దర్శకత్వం వహించారు. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమీషనర్‌ శ్రీనివాసరెడ్డి క్లాప్‌ కొట్టారు. అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతల్లో ఒకరైన శాంతనూపతి మాట్లాడుతూ... మంచి సినిమా తీయాలనే కోరికతో అమెరికా నుంచి వచ్చాము. దాదాపు 4 సంవత్సరాలకుపైగా ప్రయత్నం చేస్తున్నాం. మధ్యలో కరోనా వల్ల చాలా టైం వేస్ట్‌ అయ్యింది. దాదాపు 30 కథలు దాకా విన్నాము. మా రైటర్‌ విశ్వజిత్‌ చెప్పిన ఈ లైన్‌ బాగా నచ్చింది. దీనికి తోడు సాయిమాధవ్‌ బుర్రాగారు మా సిన

ప్రేమించొద్దు మూవీ రివ్యూ & రేటింగ్ !!!

Image
చిత్రం: ప్రేమించొద్దు ఆర్టిస్ట్: అనురూప్, దేవమలిషెట్టి, సోనాలి గార్జే, సారిక, మానస, లహరి, యశ్వంత్ పెండ్యాల, సంతోషి తదితరులు  టెక్నీషియన్స్: బ్యానర్ : సిరిన్ శ్రీరామ్ కేఫ్  రైటర్, ఎడిటర్,ప్రొడ్యూసర్, డైరెక్టర్ : సిరిన్ శ్రీరామ్  డి . ఓ. పి : హర్ష కొడాలి సంగీతం : చైతన్య స్రవంతి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ : కామరాన్  లిరిక్స్ : శ్రీ సాయి కిరణ్ సౌండ్ మిక్సింగ్ : అరవింద్ మీనన్  ప్రేమకథలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది, యువత మంచి లవ్ స్టోరీస్ ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. జూన్ 7న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైన ప్రేమించొద్దు సినిమా విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది ? ఆడియన్స్ ను మెప్పించిందా రివ్యూ లో చూద్దాం.   కథ: లాలస ( సారిక ) కమల్ ( అనురూప్) తో ప్రేమలో ఉంటుంది , అనుకోకుండా సారాస్ ( దేవ మలిశెట్టీ ) తో ప్రేమలో పడుతుంది. కమల్ అండ్ సారస్  ఇద్దరు లాలస నీ గాఢంగా ప్రేమిస్తారు ... తన కోసం ప్రాణాలు ఇవ్వడానికైన సిద్ధపడతారు. లాలస కూడా ఇద్దరితో చాలా చనువుగా ఉంటుంది ఇద్దరినీ ఇష్టపడుతుంది కానీ తను ఒక కన్ఫ్యూజన్ లో ఉంటుంది, లాలస, కమల్ జీవితంలోకి సారాస్ ఎందుకు వచ్చాడు ? చివరికి లాలస కమల్ వైపు మొగ్గు చూ

"ఏ మాస్టర్ పీస్" మనం గర్వంగా చెప్పుకునే సూపర్ హీరో మూవీ అవుతుంది - టీజర్ లాంఛ్ లో హీరో అరవింద్ కృష్ణ

Image
'శుక్ర', 'మాటరాని మౌనమిది' వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్  రూపొందిస్తున్న కొత్త సినిమా "ఏ మాస్టర్ పీస్". మనీష్ గిలాడ, అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ప్రతిష్టాత్మక ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియో మెర్జ్ ఎక్స్ ఆర్ తో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ  "ఏ మాస్టర్ పీస్" సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలిసిన ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది.  ఈ రోజు హైదరాబాద్ లో "ఏ మాస్టర్ పీస్" సినిమా టీజర్ విడుదల కార్యక్రమాన్నిఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ శివరామ్ చరణ్ మాట్లాడుతూ - "ఏ మాస్టర్ పీస్" సినిమాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు సుకు పూర్వజ్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాతో అరవింద్ కృష్ణ మరో లీగ్ లోకి వెళ్లాలని కోరుకుంటున్నా. మనీష్ గారు సెట్ లో ఉంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఉండేవి. ఆయన ఉంటే మేమంతా హ్యాపీగా ఉండేవాళ్లం. విలన్ గా ఎంట్రీ ఇస్తున్న మనీష

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ , రెడ్ జెయింట్ బ్యాన‌ర్స్ భారీ చిత్రం ‘భారతీయుడు 2’ నుంచి ‘తాతా వస్తాడే’ అంటూ ఊపు తెప్పించే పాట విడుదల

Image
యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది.ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించారు. ఇది వరకు విడుదల చేసిన శౌర సాంగ్ అందరికీ తెలిసిందే. ఆ పాటతో సినిమా మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. చైన్నైలో ఈ మధ్యే జరిగిన ఆడియో లాంచ్ వేడుకలో చిత్రయూనిట్ మాట్లాడిన మాటలు, అనిరుధ్ ఇచ్చిన లైవ్ పర్ఫామెన్స్‌లు సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి అదిరిపోయే బీట్‌ను రిలీజ్ చేశారు. మాస్‌కు కిక్కిచ్చేలా తాతా వస్తాడే.. అదరగొట్టి పోతాడే అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో సిద్దార్ధ్ వేసిన స్టెప్పులు బాగున్నాయి. ఇక ఈ పాట శంకర్ స్టైల్‌లో ఎంతో గ్రాండియర్‌గా కనిపిస్తోంది. వందల మంది డ్యాన్సర్లతో ఈ పాటను కంపోజ్ చేసినట్టుగా కనిపిస్తోంది. కాసర్ల శ్యామ్ సాహిత్యం, అరుణ్ కౌండిన్య గాత్రం, అనిరుధ్