Posts

తెలుగు మోషన్‌ పిక్చర్స్‌ టీవీ వెబ్‌ సిరీస్‌ అండ్‌ డిజిటల్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం!

Image
తెలుగు మోషన్‌ పిక్చర్స్‌ టీవీ వెబ్‌ సిరీస్‌ అండ్‌ డిజిటల్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ ఎన్నికలు ఇటీవల హైదరాబాద్‌లో జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా బి.సీతారామ్‌, ప్రధాన కార్యదర్శిగా మొగల్‌ మైభు బ్‌ బేగ్‌ (అలియాస్‌ కదిరి బాష), కోశాధికారిగా కె.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా మల్లికార్జున్‌రెడ్డి, ఉప ప్రధాన కార్యదర్శిగా బి.లక్ష్మయ్య,  ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా ఎం.డి. జమాలుద్దీన్‌ విజయం సాధించారు. ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, స్టార్‌ డైరెక్టర్‌. బోయపాటి శ్రీనివాస్‌, ఫెడరేషన్‌ అధ్యక్షులు వల్లభనేని అనిల్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి పి.ఎస్‌.ఎన్‌.దొరౖెె, కోశాధికారి సురేష్‌ సమక్షంలో తెలుగు మోషన్‌ పిక్చర్స్‌ టీవీ వెబ్‌ సిరీస్‌ అండ్‌ డిజిటల్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.

టోని కిక్, సునీత మారస్యార్ హీరో హీరోయిన్లుగా A3 లేబుల్స్ బ్యానర్‌పై బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో లాంఛనంగా ప్రారంభమైన చిత్రం

Image
టోని కిక్, సునీత మారస్యార్ హీరో హీరోయిన్లుగా A3 లేబుల్స్ బ్యానర్‌పై కొత్త చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ సన్నిధానంలో లాంఛనంగా ప్రారంభమైంది.  బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో గిరీష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత చిన్నికృష్ణ క్లాప్ కొట్టగా, ఏఐ ప్లెక్స్ ప్రదీప్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రైటర్ వెలిగొండ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా... చిన్నికృష్ణ మాట్లాడుతూ ‘‘ఏ 3 లేబుల్స్ బ్యానర్ పై ప్రదీప్, గిరీష్ గారు కలిసి సినిమాను నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కథలోని అరవై సీన్స్ ను నేను విన్నాను. రామ్, లక్ష్మణ్ కలిసి చేసిన ఆల్బమ్స్ సౌతిండియాలోనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. వారి ఆల్బమ్ లోని అల్లా హే అల్లా అనే పాటను కథగా మార్చి సినిమా తీస్తున్నారు. ఈ సినిమా తర్వాత బుల్లెట్ బండి లక్ష్మణ్ టాప్ మోస్ట్ డైరెక్టర్ గా నిలబడతారు. ఈ మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. టీమ్ ను అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.   రైటర్ వెలిగొండ శ్రీన

తెలుగుదేశం పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్‌ తెలుగుదేశం ప్రకాష్‌ రెడ్డి, శిరీషా, సీబీఎన్‌ వారియర్స్‌

Image
శుక్రవారం ఎన్‌టిఆర్‌ భవన్‌లో సీబీఎన్‌ వారియర్స్‌ మరియు గుమ్మడి గోపాలకృష్ణ ప్రొడ్యూస్‌ చేసిన వీడియో పాటల విడుదల కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాలుగు వీడియో పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు మరియు రాజకీయ కార్యదర్శి టి.డి. జనార్థన్‌, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న, నిర్మాతలు కె.ఎస్‌. రామారావు, గుమ్మడి గోపాలకృష్ణ, కొడాలి వెంకటేశ్వర్‌ రావులు అతిథులుగా పాల్గొని పాటల వీడియోను విడుదల చేశారు.  ఈ సందర్భంగా  పొలిట్‌బ్యూరో సభ్యులు, టి.డి. జనార్థన్‌ మాట్లాడుతూ...  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల దృష్ణా ఏపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో చేసిన అరాచకం,  ప్రజలను వేధించిన విధానం, భావితరాలకు ధన, మాన రక్షణ కరవైంది. కనుక ఏపీ లోని ఈ పరిస్థితులకు చలించిన కొంత మంది సినీ ప్రముఖులు కొన్ని పాటలను రూపొందించారు. కె.ఎస్‌. రామారావు, కొడాలి వేంకటేశ్వర్‌ రావులు కలిసి రెండు పాటలను రూపొందించారు. గుమ్మడి గోపాలకృష్ణ గారు ఇంతకుముందే 12 పాటలను రూపొందించి ఉన్నారు. ఇప్పుడ

డైరెక్టర్ మారుతి అప్పుడు ‘బేబీ’ ఇప్పుడు ‘బ్యూటీ’ !!!

Image
2023 లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో ‘బేబీ’ ఒక‌టి. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది సినిమాలో నటించిన అందరూ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ సినిమా నిర్మాణంలో ప్రముఖ ద‌ర్శ‌కుడు మారుతి కీల‌క పాత్ర పోషించారు. ఇప్పుడు మారుతి నుంచి ‘బేబీ’లాంటి మ‌రో సినిమా వ‌స్తోంది. దీనికి ‘బ్యూటీ’ అనే చ‌క్క‌టి టైటిల్ ఫిక్స్ చేశారు. సుబ్ర‌హ్మ‌ణ్యం ఆర్‌.వీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో క‌లిసి మారుతి టీమ్ నిర్మిస్తోంది. ఏ. విజ‌య్ పాల్ రెడ్డి నిర్మాత‌. ఈనెల 22న ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభిస్తారు. అప్పుడే టైటిల్ ని కూడా అధికారికంగా ప్ర‌క‌టిస్తారు. ‘బేబీ’లో సినిమాలో దాదాపు అంతా కొత్త‌వారే క‌నిపించారు. అయితే అందులో క‌ల్ట్ పాయింట్ ప‌ట్టుకొన్నారు. అది యూత్‌కి బాగా న‌చ్చింది. ఈ ‘బ్యూటీ’ కూడా అంతేన‌ని స‌మాచారం. యూత్ ని టార్గెట్ చేస్తూనే, ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి కూడా చేరువ‌య్యే పాయింట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బేబీ’ ఫేమ్ విజ‌య్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. ఇప్ప‌టికే 3 పాట‌ల్ని రికార్డ్

100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో ZEE5లో దూసుకెళ్తోన్న విశ్వక్ సేన్ ‘గామి’

Image
ఎంటర్‌టైన్‌మెంట్‌ను నాన్ స్టాప్‌గా అందించటంలో ఎప్పుడూ ముందుండే వన్ అండ్ ఓన్లీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ZEE5. డిఫరెంట్ మూవీస్, సిరీస్‌లతో ఎంటైర్ ఇండియాలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా వినోదాన్ని అందిస్తోంది జీ 5. తాజాగా ‘గామి’ చిత్రంతో ZEE5 ప్రేక్షకులను అలరిస్తోంది.  మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధానపాత్రలో నటించారు. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశంతో ‘గామి’ సినిమా తెరకెక్కింది.  విధ్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ  మార్చి 8న థియేటర్స్‌లో విడుదలై సూపర్బ్ రెస్పాన్స్‌ను రాబట్టకుంది. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని జీ 5 ఏప్రిల్ 12 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. జీ 5లో స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచి గామి దూసుకెళ్తోంది. డిఫరెంట్ కంటెంట్ ఉన్న ఈ చిత్రం ఆడియెన్స్‌కు అతి తక్కువ కాలంలో చేరువైంది. స్ట్రీమింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ ‘గామి’ చిత్రానికి రావటం విశేషం.  ‘గామి’ అంటే యాత్రికుడు.. కథ విషయానికి వస్తే .. హరిద్వార్‌లో ఉండే అఘోరా శంకర్ (విశ్వక్ సేన్) వింత సమస్యతో బాధపడుతుంటాడు.

హలో బేబీ సాంగ్ లాంచ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి !!!

Image
ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ నిర్మాణంలో రాబోతున్న చిత్రం *హలో బేబీ* ఈ చిత్రంలో ఒక పాటను *మ్యూజిక్ డైరెక్టర్ కోటి * లాంచ్ చేశారు.  *హలో బేబీ* అంటూ ఈ పాటను *సాదిక్ ఇమ్రాన్* రచన మరియు గాత్రం కూడా అందించడం జరిగింది.  మ్యూజిక్ డైరెక్టర్ కోటి  మాట్లాడుతూ ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి చిత్రంలో నేను ఎందుకు మ్యూజిక్ ఇవ్వలేదా అని బాధపడుతున్నాను. ఇలాంటి ఒక చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది. కథ వినగానే నేనే ఆశ్చర్యపోయాను. ప్రేక్షకులకి నచ్చే చిత్రం తీసినందుకు నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ కు మరియు యూనిట్ కి ఆల్ ద బెస్ట్ అన్నారు.  హలో బేబీ చిత్రం దర్శకత్వం వహించిన రాంగోపాల్ రత్నం, కెమెరామెన్ రమణ కే నాయుడు, ఎడిటర్ సాయిరాం తాటిపల్లి మ్యూజిక్ సుకుమార్ పమ్మి, పనితనం అద్భుతంగా ఉంది. భారతదేశంలోనే మొట్టమొదటి హాకింగ్ సోలో క్యారెక్టర్ చిత్రమైన ఈ హలో బేబీ లో కావ్య కీర్తి ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది అన్నారు నిర్మాత ఆదినారాయణ కాండ్రేగుల.

100వ వ సారి చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకులోర‌క్త‌దానం చేసిన న‌టుడు మ‌హ‌ర్షి రాఘ‌వ‌.. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్ర‌త్యేక స‌న్మానం

Image
తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకుకి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. 26 ఏళ్లుగా లక్షలాది మందికి ర‌క్త‌నిధులు ఉచితంగా దానం చేసి ఎందరో  ప్రాణాల‌ను నిల‌బెట్టిన బ్ల‌డ్ బ్యాంక్ స్థాప‌కులు మెగాస్టార్ చిరంజీవికి అండ‌దండ‌గా నిలుస్తోంది మాత్రం అభిమానులు మాత్ర‌మే.  వంద‌లాది మెగాభిమానులు అందిస్తోన్న స‌పోర్ట్‌తో చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకు నిరంత‌ర సేవ‌ల‌ను అందిస్తోంది.  ఈ బ్ల‌డ్ బ్యాంకుకి వెన్నుద‌న్నుగా నిలుస్తోన్న లక్షలాది రక్తదాతలలో ప్రముఖ న‌టుడు మ‌హ‌ర్షి రాఘ‌వ ఒక‌రు.  మెగాస్టార్‌పై అభిమానంతో 1998 అక్టోబర్ 2వ తేదిన చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ స్టార్ట్ అయిన‌ప్పుడు ర‌క్త‌దానం చేసిన తొలి వ్య‌క్తి ముర‌ళీ మోహ‌న్‌.. రెండో వ్య‌క్తి మ‌హ‌ర్షి రాఘ‌వ కావ‌టం విశేషం.  ఇప్పుడు మ‌హ‌ర్షి రాఘ‌వ 100వసారి ర‌క్త‌దానం చేయ‌టం గొప్పరికార్డు . 100వ సారి ర‌క్త‌దానం చేస్తున్నప్పుడు  కచ్చితంగా నేను కూడా వస్తాను అని  అప్పట్లో రాఘవకు చిరంజీవి మాటిచ్చారు.  అయితే అనుకోకుండా 100వ సారి మ‌హ‌ర్షి రాఘ‌వ ర‌క్త‌దానం చేసే స‌మ‌యంలో చిరంజీవి చెన్నైలో ఉన్నారు.  హైద‌రాబాద్ వ‌చ్చిన ఆయ‌న విష‌యం తెలుసుకుని మ‌హ‌ర్షి రాఘ‌వ‌ను ప్ర‌త