భాష ఆధారిత, వ్యక్తిగతీకృత కంటెంట్ ప్లాట్‌ఫారంగా మారుతూ కొత్త బ్రాండ్ ఐడెంటిటీతో ముందుకు వస్తోన్న ZEE5

 

-  ఆధునిక భారతీయ ఆత్మను ప్రతిబింబించేలా అధునికతతో ఆకర్షణీయమైన కొత్త లోగోతో ZEE5

 

-  వైవిధ్యమైన భాషలు, కథలతో, సినీ సెలబ్రిటీల భావోద్వేగాల అనుబంధాలను ఆవిష్కరించేలా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులతో మానసికంగా ముడిపడేలా రూపకల్పన

 

- అల్ట్రా హై డెఫినిషన్ క్వాలిటీ కంటెంట్, డాల్బీ ఆటమాస్‌తో నెలకు ₹120 ప్రారంభ ధరలో 7 భాషల్లో ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తోన్న ZEE5

 

- 2026 ఏడాదిలో 130కి పైగా కొత్త టైటిల్స్ విడుదలకు సిద్ధం – ఒరిజినల్ షోలు, సినిమాలు, నాన్-ఫిక్షన్, లైవ్ కంటెంట్ మరియు మరెన్నో భిన్న భాషల్లో మెప్పించనున్న ZEE5

 

భారతదేశ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ రంగంలో తన స్థానాన్ని మరింత బలపరిచే దిశగా ముందడుగు వేసింది ZEE5. అందులో భాగంగా తన కొత్త బ్రాండ్ ఐడెంటిటీని తెలియజేస్తూ వ్యూహాత్మకంగా ముందడగు వేసింది. ZEE5 తన శక్తివంతమైన కొత్త బ్రాండ్ ఐడెంటిటీ, వ్యూహాత్మక మార్పును అధికారికంగా ప్రకటించింది. ZEE5 డెవలప్‌మెంట్‌లో దీన్ని కీలక ఘట్టంగా అభివర్ణించవచ్చు. ‘మన భాష -  మన కథలు’ అనే పున: ప్రారంభంతో భారతీయ సంస్కృతిలోని బోలెడు కథలను నిబద్ధతతో చెప్పటానికి, భాషాధారిత, వ్యక్తీగతీకరణకు, అత్యాధునిక సాంకేతికతకు ఈసారి ఎక్కువ ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోంది.


కొత్త విజువల్ ఐడెంటిటీ, ప్రొడక్ట్‌ను పునరావిష్కరించిన అనుభవం, భారతదేశంలోని బహు భాషలపై ఆధారపడి భాషా ప్రణాళికలతో రూపొందించిన జీ5 తన ప్రేక్షకులతో అనుబంధాన్ని మరింతగా పెనవేసుకుంటోంది. కంటెంట్, అనుభవం, అందుబాటు ధరలు అనే మూడు ప్రధాన అంశాలపై ఈ వ్యూహాత్మక మార్పు నిర్మితమైంది. జీ5 భాష, కంటెంట్ వ్యూహం ఏంటంటే ప్రజల భావోద్వేగాలకు దగ్గరగా ఉండేలా, స్థానిక సంస్కృతిలో నిక్షిప్తమైన కథలను అందించేందుకు రూపుదిద్దుకోనుంది. జానపథ గాథలు, నిజజీవిత వీరుల కథలు, పురాణాల నుంచి ప్రేరణ పొందిన కథలతో ఇవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
 

భాషాపరమైన ప్యాకేజీల విషయానికి వస్తే.. రూ.120/నెల నుండి ప్రారంభమవుతాయి. హిందీ ప్యాక్ (పంజాబీ & భోజ్‌పురి కంటెంట్‌తో సహా) ధర రూ.220/నెలగా నిర్ణయించబడింది. అన్ని భాషల కంటెంట్‌ను పొందే All Access ప్యాక్‌ను రూ.320/నెలకు అందించనున్నారు. అన్ని ప్యాక్స్‌కి వార్షిక చందాలు కూడా అందుబాటులో ఉంటాయి.

 

ZEE5 త్వరలో విడుదల కంటెంట్‌ను గమనిస్తే – డిటెక్టివ్ షేర్‌దిల్ (హిందీ), ఛల్ కపట్: ది డిసెప్షన్ (హిందీ), సత్తముం నీతియుం (తమిళం), మోతుబారు లవ్ స్టోరీ (తెలుగు), ఇన్స్పెక్షన్ బంగ్లా (మలయాళం), మారిగళ్లు (కన్నడ), ఆట ఆట తంభ్యా న్యాయ్ (మరాఠీ), మరియు విభీషణ్ (బెంగాలీ) వంటి అనేక ప్రాంతీయ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రేక్షకులకు మరింత సినిమాటిక్, కంటెంట్ అనుభూతిని ఇచ్చేలా ZEE5 కొత్త దిశలో ఇన్‌ట్యూయిటివ్ డిజైన్, AI ఆధారిత వ్యక్తిగతీకరణ (పర్సనలైజేషన్) పై కూడా ప్రత్యేకంగా దృష్టిని సారించింది. ప్రతి వినియోగదారుడి అభిరుచులకు సరిపోయేలా రికమెండేషన్లు అందిస్తూ, దేశంలోని అన్ని పిన్‌కోడ్లలోని ప్రేక్షకులతో లోతైన అనుబంధాన్ని ఏర్పరచే దిశగా ముందుకు సాగుతోంది జీ5. ఇప్పుడు డేటా ఆధారిత అనాలిటిక్స్‌ను ఉపయోగించడంతో ఏ డివైస్‌లోనైనా, ఎక్కడైనా ZEE5 ఇప్పుడు మరింత సులభమైన, వ్యక్తిగతీకృత,  ఉత్తమ స్ట్రీమింగ్ అనుభవాన్ని ప్రేక్షకులకు అందిస్తోంది.

 

*బ్రాండ్ ఫిల్మ్ లింక్ - Apni Bhasha, Apni Kahaniyan | మన భాష. మన కథలు* - https://youtu.be/iPcS9DPx0pc

 

జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ డిజిటల్ బిజినెస్ అండ్ ప్లాట్‌ఫామ్స్ ప్రెసిడెంట్ అమిత్ గోయెంకా మాట్లాడుతూ ‘‘మా కొత్త బ్రాండ్ ఐడెంటిటీ అనేది మా ప్రయాణంలో ఒక కీలకమైన దశ. ఇది భారతదేశపు భిన్నతను ప్రతిబింబించేలా రూపొందిన, వ్యక్తిగతీకరించబడిన, భాష ఆధారిత ప్లాట్‌ఫారంగా మారేందుకు తీసుకున్న దిశానిర్దేశకమైన అడుగుగా భావిస్తున్నాం. మా వ్యూహాత్మక దృష్టి స్పష్టంగా ఉంది. భారతదేశం అంతటానే కాకుండా అంతర్జాతీయంగా మా ప్రభావాన్ని విస్తరించడం, సాంస్కృతికంగా సన్నిహితమైన కథల ద్వారా ప్రేక్షకులతో బలమైన అనుబంధాన్ని ఏర్పరుచుకోవటం,టెక్నాలజీ ఆధారంగా పనిచేసే, స్కేలబుల్, వ్యక్తిగతీకరించిన, ఇంట్యూయిటివ్ ప్లాట్‌ఫారాన్ని నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకుని అడుగులు వేశాం. ఇది వినియోగదారులు ఎలా కనుగొంటారు, దీనికి ఎలా అనుసంధానమవుతారనే దాన్ని ఒక సాంస్కృతిక మార్పుగా పేర్కొనవచ్చు’’ అన్నారు.


జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కార్తిక్ మహదేవ్ మాట్లాడుతూ ‘‘‘మన భాష మన కథలు’ అనేదే మా క్యాంపెయిన్ మూల సారాంశం. ఎందుకంటే భాష అనేది మనది, మన సంబంధం, మన భావోద్వేగాలకు అద్దం పట్టేది భాష. ఒక కథ మీ భాషలో చెప్పబడినప్పుడు, అది చూసిన అనుభూతికంటే, అనుభవించిన అనుభూతిని కలిగిస్తుంది.  7 భాషల్లో రూపొందించిన ఈ మల్టీలింగువల్  క్యాంపెయిన్ చిన్న పట్టణాల నుంచి పెద్ద నగరాల వరకు, అలాగే టైర్2, టైర్3 ప్రాంతాలు , అంతర్జాతీయ ప్రేక్షకులు.. ఇలా అందరికీ అనుసంధానమయ్యేలా రూపొందించబడింది. మా భాష-ప్రథమ కంటెంట్ వ్యూహం, హైపర్-లోకల్ పర్సనలైజేషన్‌కు మూలమైన ఈ ప్రచారం, "మీ భాషలో కథలు అంతులేని వన్నెలతో ఉంటాయి" అనే ZEE5 నమ్మకాన్నినమ్ముతోంది’’ అన్నారు.

జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ రాఘవేంద్ర హున్సూర్ మాట్లాడుతూ ‘‘ZEE5 నమ్శకం ఏంటంటే శక్తివంతమైన కథలనేవి లోతైన సాంస్కృతిక అవగాహనతోనే ప్రారంభమవుతాయి. చరిత్రలో ఎవరూ గుర్తించని విషయాలను ప్రేక్షకులకు చేరేలా చూసుకోవటాన్ని మా బాధ్యతగా భావిస్తున్నాం. వారి భాషల్లో,  నిజమైన జీవన అనుభవాలపై ఆధారపడి, మేము తయారుచేసే కంటెంట్‌ పరిధిని మాత్రమే కాదు, వారికోసం ప్రత్యేకంగా రూపొందించే ఉద్దేశాన్ని కూడా విస్తరిస్తున్నాం. ఎక్కువ కాలం ఉండే ఒరిజినల్స్ కావొచ్చు,  షార్ట్-ఫార్మ్ కంటెంట్ కావొచ్చు లేదా ప్రయోగాత్మక ఫార్మాట్లు అయినా కావొచ్చు . ప్రతి ఫార్మాట్‌లోనూ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఆనందం కలిగించడం మా లక్ష్యం. ఇది మా కంటెంట్ వ్యూహం మాత్రమే కాదు.. వాటిని చూడాలనుకునే ప్రేక్షకులుతీసుకునే ప్యాకేజీలతో అనుసంధానం చేయటం ద్యారా జీ5ను అనుసంధానమయ్యే ప్రాథమిక కేంద్రంగా నిలపుతున్నాం" అన్నారు.

జీ సంస్థ వాగ్దానమైన ‘Yours Truly, జీ’కు ఈ  బ్రాండ్ మార్పు పరిపూర్ణంగా అనుగుణంగా ఉంది. ZEE5 పరిణామంలో ఇది ఒక కీలక దశగా నిలవటమే కాకుండా ప్లాట్‌ఫామ్ అభివృద్ధిలో తదుపరి దశకు బలమైన పునాది వేసింది. భారీ స్థాయిలో హైపర్-లోకల్ కథనాలను అందించే తన నిబద్ధతను మరింత బలపరచుతూ, ZEE5 ఇప్పుడు దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయంగా భిన్న భాషలలో, ప్రజల మన్ననలు పొందే కథనాలకు కేంద్ర బిందువుగా అవతరించుతోంది.

Comments

Popular posts from this blog

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి "ప్రేమిస్తున్నా'' టైటిల్ ఖరారు !!!

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!