రిచర్డ్ రిషి నటించిన ‘ద్రౌపది 2’ చిత్రీకరణ పూర్తి
జి.ఎం. ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి నేతాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద చోళ చక్రవర్తి నిర్మిస్తున్న చిత్రం ‘ద్రౌపది 2’. తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంగా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌కి మోహన్.జి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రిచర్డ్ రిషి ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామాకు సంబంధించిన షూటింగ్ నేటి(సెప్టెంబర్ 23)తో ముగిసింది. ఈ మేరకు దర్శక, నిర్మాతలు సినిమా గురించి కొన్ని విశేషాల్ని పంచుకున్నారు. *దర్శకుడు మోహన్.జి మాట్లాడుతూ* .. ‘దర్శకుడు ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా, చివరికి నిర్మాత సపోర్ట్, మద్దతుతోనే షూటింగ్‌ను పూర్తి చేయగలం. చిత్రీకరణమైన సమయంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా కూడా నిర్మాత చోళ చక్రవర్తి ఇచ్చిన సపోర్ట్‌తోనే చిత్రీకరణను పూర్తి చేయగలిగాను. ఆయనకు ఇది తొలి ప్రాజెక్ట్ అయినప్పటికీ, సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్, ఇష్టం, అనుభవం, కళ, విజన్ వల్లే ఇంత గ్రాండ్‌గా చిత్రీకరించగలిగాం. సృజనాత్మక స్వేచ్ఛను ఇవ్వడంతో ఈ మూవీని అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించానని అనుకుంటున్నాను’ అని అన్నారు. *నిర్మాత చోళ చక్రవర్తి మాట్లాడుతూ* .. “దర్శకుడు మోహన్. జి గారితో కలిసి పనిచేయడం ఆనందం...