Posts

అమ్జాద్ హబీబ్ ప్రీమియం సెలూన్ న్యూ బ్రాంచ్ హీరోయిన్ దివి చేత ప్రారంభం

Image
100 సంవత్సరాలకు పైగా అందం మరియు వెల్‌నెస్‌లో విశ్వసనీయమైన సేవలను అందిస్తున్న అమ్జాద్ హబీబ్ ప్రీమియం సెలూన్, హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్‌లో తన 9వ సెలూన్‌ను ప్రగతినగర్ రత్నదీప్ పై ప్రారంభించారు, హీరోయిన్ దివి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2200 చదరపు అడుగుల్లో విస్తరించిన ఈ సెలూన్, మహిళలు మరియు పురుషులకు ప్రత్యేక సెషన్లు అందిస్తోంది. అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన ప్రొడక్ట్స్‌ను ఉపయోగించి, ప్రీమియం సేవలను సరసమైన ధరల్లో అందించి, శుభ్రమైన మరియు కస్టమర్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని కల్పిస్తుంది. ఫ్రాంచైజ్ అవకాశాలు అందం మరియు వెల్‌నెస్‌పై ఆసక్తి ఉన్న వ్యాపార భాగస్వాములను స్వాగతిస్తున్నాము. శిక్షణ, ఆపరేషన్స్, మార్కెటింగ్ తదితరాలలో పూర్తి సహాయాన్ని అందిస్తాము. మ్యానేజింగ్ డైరెక్టర్లు మహేష్ మరియు షాబుద్దీన్ మాట్లాడుతూ – "మా బ్రాండ్‌ను విస్తరించేందుకు, అందం మీద ఆసక్తి ఉన్న భాగస్వాములతో కలిసి ప్రపంచ స్థాయి అనుభూతులను అందించేందుకు మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాము" అన్నారు. Amjad Habib new branch launch by heroine Divi

*"అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ" బయోపిక్ టైటిల్ హక్కులు మాకే సొంతం, "ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ" మూవీ నిర్మాతపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం - వీఎన్ఆర్ ఫిలింస్*

Image
అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ బయోపిక్ టైటిల్ తో వీఎన్ఆర్ ఫిలింస్ సంస్థ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ బయోపిక్ చిత్రానికి ఎ.ఆర్.బి. నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అచ్చర్త రాజుబాబు దర్శకత్వం వహిస్తున్నారు.  అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ బయోపిక్ టైటిల్ హక్కులు తమకే సొంతమని, ఈ టైటిల్ ను ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ చేయించామని వీఎన్ఆర్ ఫిలింస్ వెల్లడించింది. అయితే ఎలాంటి టైటిల్ రిజిస్ట్రేషన్ లేకుండా ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ టైటిల్ తో ఊషారాణి మూవీస్ బ్యానర్ లో వల్లూరి రాంబాబు నిర్మాతగా, రవి నారాయణ్ దర్శకుడిగా సినిమా రూపొందిస్తున్నారు.  *ఈ విషయంపై వీఎన్ఆర్ ఫిలింస్ స్పందిస్తూ -* అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ బయోపిక్ టైటిల్ ను మేము ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ చేయించాం. అయితే ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ టైటిల్ తో ఊషారాణి మూవీస్ సినిమా రూపొందిస్తోంది. ఈ చిత్ర దర్శకుడు రవి నారాయణ్ మమ్మల్ని గతేడాది టైటిల్ ఇవ్వమని అడిగారు. మేము సినిమా చేస్తున్నాం కాబట్టి ...

'ఆహా'లో 'తెలుగు ఇండియన్ ఐడల్' షో చేస్తుండటం గర్వంగా ఉంది - సీజన్ 4 స్క్రీనింగ్, గ్రాండ్ ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్

Image
తెలుగులో అతి పెద్ద సింగింగ్ షో ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ సీజన్ లో టాప్ 12 కంటెస్టెంట్స్ టాలెంట్ ను ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం 7 గంటల నుంచి ఆహాలో చూడొచ్చు. ఈ సంగీత కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు తమన్, గాయకులు కార్తీక్ మరియు గీతా మాధురి జడ్జెస్ గా అలాగే శ్రీరామచంద్ర హోస్ట్ గా, సమీరా భరద్వాజ్ కో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 స్పెషల్ స్క్రీనింగ్ చేశారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో సింగర్ సమీరా భరద్వాజ్ మాట్లాడుతూ - తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 వంటి ప్రెస్టీజియస్ షోలో హోస్ట్ గా చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఈ షో గురించి మాట్లాడే  ప్రతి మాటా నా మనసులో నుంచే వస్తోంది. అల్లు అరవింద్ గారికి, తమన్ గారికి థ్యాంక్స్. చెప్పాల్సినవి ఎన్నో ఉన్నాయి, అవన్నీ షోలోనే మాట్లాడుతాను. అన్నారు. సింగర్ గీతా మాధురి మాట్లాడుతూ - తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4కు జడ్జ్ గా వ్యవహరించే అవకాశం ఇచ్చిన ఆహాకు థ్యాంక్స్. ఇది మూడోసారి వరుసగా నేను ఈ కా...

విజయవాడలో ‘కలర్స్ హెల్త్ కేర్’ లాంచ్ చేసిన సంయుక్త మీనన్

Image
విజయవాడ: ప్ర‌ముఖ హెల్త్ కేర్ సంస్థ ‘కలర్స్’ (Kolors Healthcare) విజయవాడలో కొత్త బ్రాంచీని ఏర్పాటు చేసింది. శ్రీనివాస్‌నగర్ బ్యాంకు కాలనీలో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ నూతన బ్రాంచ్‌ను హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఆమె స్వయంగా పరిశీలించి నిర్వాహకులను అభినందించారు.  ఈ సందర్భంగా సంయుక్త మీనన్ మాట్లాడుతూ – “ప్రతి ఒక్కరూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. ఒకరిలా మనం అనుకరించడం కాదు, మనకు తగిన స్టయిల్ లో మనం ఉండాలి. ఆధునిక టెక్నాలజీతో నాణ్యమైన హెల్త్ కేర్ సేవలు అందిస్తున్న కలర్స్ హెల్త్ కేర్ నిర్వాహకులకు అభినందనలు. అందరూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటాం. అలాంటి ఆహ్లాదకరమైన, విశ్వసనీయమైన సేవలను విజయవాడ ప్రజలకు అందించడానికి ఈ సంస్థ ముందుకు రావడం ఆనందంగా ఉంది” అని తెలిపారు. కలర్స్ హెల్త్ కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన మాట్లాడుతూ – “2004లో ప్రారంభమైన కలర్స్ హెల్త్ కేర్ ఇప్పటివరకు వేలాది మంది కస్టమర్లను సంతృప్తి పరిచింది. ఈ నేపథ్యంలో 'కలర్స్ హెల్త్ కేర్'ను  దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో ఇప్పుడు విజయవా...

"లిటిల్ హార్ట్స్" సినిమాకు సెలబ్రిటీల ప్రశంసల వెల్లువ, మూవీ టీమ్ ను అప్రిషియేట్ చేసిన మాస్ మహారాజా రవితేజ

Image
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన "లిటిల్ హార్ట్స్" సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు లభిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, నాని, నాగవంశీ, సాయి రాజేశ్, టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషాన్ జీవింత్ వంటి సెలబ్రిటీలు ఈ చిత్రాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. తాజాగా మాస్ మహారాజా రవితేజ "లిటిల్ హార్ట్స్" సినిమా బాగుందంటూ ట్వీట్ చేశారు. 'హార్ట్, హ్యూమర్, హానెస్ట్ పర్ ఫార్మెన్సెస్.. అన్నీ ది బెస్ట్ అనేలా ఉన్నాయి. మూవీ టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు..' అంటూ విశెస్ అందించారు.  "లిటిల్ హార్ట్స్" చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రేక్షకాదరణతో 4 రోజుల్లో 15.41 కోట్ల...

"లిటిల్ హార్ట్స్" సినిమాతో డీవోపీగా మంచి గుర్తింపు దక్కడం హ్యాపీగా ఉంది - సూర్య బాలాజీ

Image
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన "లిటిల్ హార్ట్స్" సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమాకు వస్తున్న అప్రిషియేషన్స్ లో డీవోపీ వర్క్, బ్యూటిఫుల్ విజువల్స్ గురించి మాట్లాడుతున్నారు. సూర్య బాలాజీ ఈ చిత్రంతో సినిమాటోగ్రాఫర్ గా పరిచయమయ్యారు. తన తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్ని కెమెరా పనితనంతో ఆకట్టుకున్నారు. డీవోపీ పనితనం మీదే సినిమా బడ్జెట్ ఆధారపడి ఉంటుంది. లిటిల్ హార్ట్స్ చిత్రాన్ని కాంపాక్ట్ బడ్జెట్ లో రిచ్ లుక్ లో తెరకెక్కేలా చేయడంలో సూర్య బాలాజీ ప్రతిభ చూపించారు. 2.5 కోట్ల రూపాయల బడ్జెట్ లో చేసిన లిటిల్ హార్స్ట్ సినిమా తెరపై చూస్తే ఓ పది కోట్ల రూపాయల బడ్జెట్ మూవీలా అనిపిస్తుంది. అలాంటి రిచ్ లుక్ తన కెమెరా పనితనంతో తీసుకొచ్చారు సూర్య బాలాజీ. హైదరాబాద్, బెంగళూరులో ఈ సినిమాను గెరిల్లా పద్ధతిలో షూట్ చేశారు. లొకేషన్స్ ను కాకుండా కేవలం నటీనటుల క్లోజప్స్ తోనే ఎలివేట్ చేశారు. ప్రతి సీన్ సహజంగా ఉండేలా క్యాప్చర్ చేశారు. లిటిల్ హార్ట్స్ మూవీని చాలా రియలెస్టిక్ గా తన కె...

డిజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ కొత్త చిత్రం చిలకా ప్రొడక్షన్స్ లో రాగ్ మయూర్ హీరోగా ప్రారంభం !!!

Image
రచయిత-దర్శకుడు విమల్ కృష్ణ, సృజనాత్మక కథలకు పేరుగాంచాడు, 2022 కామెడీ DJ Tillu తో విజయవంతంగా అరంగేట్రం చేశాడు. ఈ చిత్రం భారీ సంచలనంగా మారింది మరియు ఆ పాత్ర తెలుగు రాష్ట్రాల్లో ఇంటి పేరుగా మారింది. ప్రతిభావంతులైన దర్శకుడు చిన్న విరామం తర్వాత తిరిగి వచ్చాడు, అన్ని సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. అతను మరో వింత పాత్రను క్రేజీ విధంగా సృష్టించడానికి మరియు పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నాడు. చిత్రనిర్మాత ఇప్పుడు చిలకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న తన తదుపరి ప్రాజెక్ట్‌తో తిరిగి వచ్చాడు. ఇటీవల మేకర్స్ విమల్ కృష్ణ మరియు సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల నటించిన సరదా వీడియోతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ వీడియో వైరల్ అయ్యింది మరియు ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై అంచనాలను పెంచింది. ఈరోజు అధికారిక పూజా వేడుకను పూర్తి చేయడం ద్వారా మేకర్స్ ఆశ్చర్యపోయారు. ఈ చిత్రంలో ప్రతిభావంతులైన రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సెసిల్, అనన్నయ, చరిత్ర్ మరియు ఇతరులు నటించారు. విమల్ కృష్ణ ప్రతిభావంతులైన సాంకేతిక బృందాన్ని ఎంపిక చేశారు.  సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీని అందిస్తున్నార...