ముక్కురాజు మాస్టర్ వేసిన పునాది చాలా గొప్పది: ఆర్ నారాయణమూర్తి
ముక్కురాజు మాస్టర్ లేకపోతే ఫిల్మ్ ఫెడరేషనే లేదు: తమ్మారెడ్డి భరద్వాజ ఘనంగా ముక్కురాజ్ మాస్టర్ విగ్రహావిష్కరణ వేడుక టీఎఫ్‌టీడీడీఏ ఏర్పాటై 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విగ్రహావిష్కరణతో వ్యవస్థాపక అధ్యక్షుడిని గౌరవించుకున్న సభ్యులు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్(టీఎఫ్‌టీడీడీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిరాజు రాజంరాజు అలియాస్ ముక్కురాజు మాస్టర్ విగ్రహ ఆవిష్కరణ వేడుక బుధవారం ఉదయం ఘనంగా జరిగింది. టీఎఫ్‌టీడీడీఏ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ముక్కు రాజు మాస్టర్ విగ్రహాన్ని ప్రముఖ దర్శకనిర్మాత ఆర్ నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ఫిల్మ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, వల్లభనేని అనిల్ కుమార్, టీఎఫ్‌టీడీడీ అధ్యక్షుడు జోసెఫ్ ప్రకాశ్, ప్రధాన కార్యదర్శి దేవర శ్రీనివాస్, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. డాన్సర్స్ యూనియన్ ఏర్పాటై 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ముక్కురాజు మాస్టర్ విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు టీఎఫ్...