అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్, అఖిల్ అక్కినేని తదుపరి చిత్రం LENIN; పవర్‌ఫుల్ టైటిల్ గ్లింప్స్ విడుదల
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. యంగ్ అండ్ డైనమిక్ అఖిల్ అక్కినేని తాజా సినిమాను నిర్మిస్తున్నాయి. అఖిల్ 6ని అక్కినేని నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్కినేని అఖిల్ పుట్టినరోజును పురస్కరించుకుని అఖిల్ 6వ చిత్రానికి లెనిన్ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ని ప్రకటించారు. మురళీ కిశోర్ అబ్బూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు మురళీకిశోర్ అబ్బూరు. ఇంటన్స్, యాక్షన్ ప్యాక్డ్ ఎక్స్ పీరియన్స్ తో రాయలసీమ నేపథ్యంలో రోమాలు నిక్కబొడుచుకునేలా సాగింది లెనిన్ గ్లింప్స్. టైటిల్ గ్లింప్స్ పవర్‌ఫుల్ విజువల్స్‌తో ప్రారంభమయింది. ఆధ్యాత్మిక అంశాలను చొప్పిస్తూ ఆద్యంతం ఆకట్టుకునే ప్రయత్నం చేశారు మేకర్స్. అఖిల్ అక్కినేని... స్టన్నింగ్ లెనిన్ కేరక్టర్‌కి అద్భుతంగా సూట్ అయ్యారు. ఆయన దట్టమైన మీసం, పొడవాటి జుట్టు, మ్యాచో అవతార్‌కి పక్కాగా సూట్ అయ్యాయి. స్ట్రైకింగ్ స్క్రీన్ ప్రెజెన...