పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన వజ్రాల దొంగ !!!
శ్రీ రమా రాఘవేంద్ర సినీ ఎంటర్త్ప్రైజెస్ బ్యానర్ పై డాక్టర్ కెవి.రమణాచారి దివ్య ఆశీస్సులతో రాబోతున్న చిత్రం వజ్రాల దొంగ. ఆర్.కె.ఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. భీమవరపు ప్రతాప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు రామిరెడ్డి రామకృష్ణారెడ్డి నిర్మాతగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా శ్రీరామ్ దత్తి వ్యవహరిస్తున్నారు. వజ్రాల దొంగ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి, ప్రముఖ వ్యాపారవేత్త రాజేశ్వర రావు గారు కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా రామచంద్ర సిద్ధాంతి గారు క్లాప్ కొట్టారు, అలాగే ఎస్.అవినాష్ గారు గౌరవ దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా, డైరెక్టర్ భీమవరపు ప్రతాప్ రెడ్డి ఈ సినిమాను సరికొత్త స్క్రీన్ ప్లే తో తెరకెక్కిస్తున్నారు, నిర్మాత రామిరెడ్డి రామకృష్ణారెడ్డి ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆర్.కె.అర్, శ్రీరామ్ దత్తి, ప్రతాప్ రెడ్డి, పి.ఎన్. మూర్తి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ఎడిటర్ : నందమూరి హరి, కొరియోగ్రఫీ: జోజో, ఫైట్స్: అవినాష్, కాస్ట్యూమ్స్ తిరుమల రా...