జనవరి 24న విడుదల కాబోతున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘హత్య’ ఆడియెన్స్‌కు డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది- టీజర్ విడుదల కార్యక్రమంలో నటుడు రవివర్మ
ప్రస్తుతం థ్రిల్లర్ జానర్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘మధ’ అంటూ సైకలాజికల్ థ్రిల్లర్‌తో అందరినీ మెప్పించిన శ్రీ విద్య బసవ ‘హత్య’ అనే మరో థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం జనవరి 24న రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాను మహాకాళ్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. గురువారం ఈ మూవీ టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నటుడు రవివర్మ చేతుల మీదుగా టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా... చిత్ర దర్శకురాలు శ్రీవిద్య బసవ మాట్లాడుతూ ‘‘నా తొలి చిత్రం మధ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లిన మీడియాకు, ఆదరించిన అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు నేను హత్య సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. థ్రిల్లర్ జోనర్‌లోనే రెండో సినిమా కూడా చేస్తున్నాను. ఇది అందరికీ తెలిసిన కథే అయినప్పటికీ గ్రిప్పింగ్‌గా, సీట్ ఎడ్జ్ ఇన్వెస్టిగేటివ్ ...