Posts

ఈటీవీ విన్ ఓటిటిలో ట్రెండింగ్ లో పైలం పిలగా చిత్రం !!!

Image
అటు ప్రేక్షకుల నుండి ఇటు విమర్శకుల నుండి ప్రశంశలు దక్కించుకొని డీసెంట్ సక్సెస్ పొందిన   'పైలం పిలగా' సినిమాకు ఇప్పుడు ఓ టి టి లో కూడా విశేష స్పందన దక్కుతోంది. అక్టోబర్ 10 నుండి ఈటీవి విన్ ద్వారా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా,  ఓ టి టి లో వచ్చే క్రైమ్, హారర్, అడల్ట్ కంటెంట్ కి భిన్నంగా  పిల్లలు, పెద్దలు ఫామిలీ అంతా కలిసి కూర్చొని  చూసే నీట్ అండ్ క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. మెలోడియస్ పాటలు, ఆకట్టుకునే డైలాగ్స్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఈ సినిమా కథ గురించి చెప్పుకోవాలంటే..... తను పుట్టి పెరిగిన ఊళ్లోనే పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసి అంబాని లా ఎదగాలనుకునే ఒక పల్లెటూరి యువకుడి కథ. తన ప్రయాణంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ముఖ్యంగా ప్రభుత్వ అనుమతుల విషయంలో బ్యూరోక్రసీలో ఉండే రూల్స్ ,  ప్రభుత్వ అధికారుల అలసత్వం, అవినీతి వల్ల విలువైన సమయాన్ని, డబ్బును ఒక దశలో  ప్రేమించిన వాళ్ళు కూడా దూరమై చివరకు తన కుటుంబం, తన ఊరు బాగు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేదే ఈ సినిమా.  పల్లెలు, ప్రకృతి, పర్యావరణం, వ్యవసాయం, ఉపాధి, వలసలు, ప...

రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ ఫిలిం 'శారీ' డిసెంబర్ 20న విడుదల

Image
డిఫరెంట్ కంటెంట్‌లతో, నిజజీవిత సంఘటనల ఆధారంగా కొత్త వారితో ప్రయోగాలు చేయడంలో ముందుండే  రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ  'శారీ'. ఆర్జీవీ డెన్ ద్వారా వెలుగు చూస్తున్న'టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ' అనే లాగ్ లైన్ తో పలు నిజజీవిత సంఘటనల మేళవింపుతో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందింది.  ఈ చిత్రం గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో RGV - AARVI ప్రొడక్షన్స్ బ్యానర్లో ప్రముఖ బిజినెస్ మాన్ రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో భయానక ప్రేమికుడిగా సత్య యాదు నటిస్తూండగా, అతనిలో సెగలు రేపే చీరలోని అమ్మాయి పాత్రలో ఆరాధ్య దేవి నటిస్తోంది. కాగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ్ మరియు మలయాళ భాషల్లో డిసెంబర్ 20న విడుదల కానుంది. 'శారీ' చిత్రం ఆంధ్ర, తెలంగాణ రాష్టాలలో వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా తెలుగులో విడుదల చేయడానికి ప్రముఖ పంపిణీ దారుడు ముత్యాల రాందాస్ మంచి ఫాన్సీ రేట్ తో థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే! ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ - " ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా భయానకమైన రిలేషన్స్ కి తెరలు లేపుతుంది.   సోషల్ మీడియ...

లగ్గం సినిమా రివ్యూ & రేటింగ్ !!!

Image
 లగ్గం ఇది కేవలం చిత్రం అయితే కాదు  ఎన్నో సంఘర్షణల నిర్ణయం ఒక లగ్గం జరపడం. ప్రతి కంట తడి వెనక కారణం, ఓ కథ ఉంటుంది.ఈ లగ్గం ప్రతి నాన్న తాలూకు బాధ్యత!! ఈ లగ్గం ప్రతి కూతురి ప్రేమ లగ్గం. మర్చిపోని, చెరగని ముద్రగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే చిత్రం లగ్గం. సదానందం (రాజేంద్రప్రసాద్) తన కూతురు మానస ( ప్రగ్యా నగ్రా ) కి పెళ్లి చేయాలి అని తన సొంత చెల్లెలు సుగుణ( రోహిణి) కొడుకు ( సాయి రోనక్) ని చూడడానికి సిటీకి వస్తాడు. తన అల్లుడి ఖరీదైన జీవితం,జీతం,సాఫ్ట్వేర్ లైఫ్  చూసి తన కూతుర్ని ఎలాగైనా సాఫ్ట్ ఇంజనీర్కే ఇచ్చి పెళ్లి చేయాలి అని డిసైడ్ అయి తన చెల్లెలితో మాట్లాడి లగ్గం ఫిక్స్ చేసుకుంటారు.               ఇక్కడే తెలంగాణ నేపథ్యంలో లగ్గం చుట్టూ ఉండే సంప్రదాయాల్ని , పద్ధతుల్ని ఆచారాల్ని, చూపిస్తూ పెళ్లి సంబరం మొదలవుతుంది. ఇంత సంబరంగా మొదలైన పెళ్లి జరిగిందా లేదా!! పెళ్లి చేయాలంటే ఇరు కుటుంబాలు ఎలా ఆలోచించాలి ఏం చేయాలి. పెళ్లి కుదిరినంత మాత్రాన పెళ్లికూతురు అవుతుందా!! అసలు లగ్గం చేయాలంటే ఏం కావాలి!! వంటి అనేక విషయాన్ని డిస్కస్ చేసుకు...

హీరో సుమన్ చేతుల మీదుగా"ఝాన్సీ ఐపీఎస్" ట్రైలర్ లాంచ్

Image
లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో తమిళ, కన్నడ భాషలలో విడుదలై ఘన విజయాన్ని  సాధించిన "ఝాన్సీ ఐపీఎస్" చిత్రం  ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది.  ప్రముఖ హీరో సుమన్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేసారు. ఈ చిత్రం తెలుగు హక్కులు ఆర్ కె ఫిలిమ్స్ అధినేత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ సొంతం చేసుకున్నారు.  ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. సుమన్ గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయడం ఆ ఆనందంగా ఉంది. సుమన్ గారికి కృతజ్ఞతలు.  లక్మీ రాయ్ త్రిపాత్రాభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.  సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే యోధురాలు. ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు కంపోజ్ చేసిన 8 ఫైట్స్  లక్మీ రాయ్ కెరీర్లో మైలు రాయిగా నిలిచిపోతాయి. ఈ చిత్రానికి కూడా ఫైట్స్ హైలెట్ గా నిలుస్తాయి. లక్మీ రాయ్ చేసిన మూడు  క్యారెక్టర్స్ డిఫరెంట్ షేడ్స్ లో ఉంటాయి. విద్యార్థులను మాదక ద్రవ్యాలకు అలవాటు చేసి, యువత భవిష్యత్ ను పెడదారి పట్టించే, డ్రగ్స్ ముఠా ఆటకట్టించే ఐపిఎస్ ఆఫీసర్ గా, గ్రామాల్లో రౌడీల అగడాలకు అడ్డుకట్టవ...

అత్యంత ప్రాచుర్యం పొందుతున్న "మన్యం ధీరుడు" సినిమాలోని "నమోస్తుతే నమోస్తుతే భారత మాతా" దేశభక్తి గీతం.

Image
   "మన్యం ధీరుడు" సినిమా  కధానాయకుడైన ఆర్ వి వి సత్యనారాయణ స్వయంగా స్వరకల్పన చేసి పాడి హిమాలయాల్లో చిత్రీకరించడం తో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.     ఈపాటను ఇటీవల కాలంలో థాయిలాండ్,మలేషియా,బ్యాంకాక్,మైన్మార్ లాంటి దేశాలలో ప్రవాస భారతీయులు విదేశీయులతో సహా మన దేశ గాయకులకు పలు ప్రశంసలందిస్తున్నారు.     త్వరలో   అమెరికాలో గల థానా మరియు జెర్మనీ లో కూడా ఈ పాటను పాడబోతున్నామని విశాఖకు చెందిన శేఖర్ ముమ్మో జీ బృందం తెలియజేసారు. ఈ పాటకు తుంబలి శివాజీ సాహిత్యాన్నందించారు.  భారత దేశ ఔన్యత్యాన్ని చాటి చెప్పే ఈ  అద్భుతమైన పాట ఇంకా ఎంతో ప్రాచుర్యం పొందాలని ఆశిద్దాం.

:: అత్యంత వైభవముగా 'జై జై దుర్గమ్మ' ట్రైలర్ లాంచ్ ::

Image
చిన్న, మధు ప్రియ  హీరో హీరోయిన్లుగా ANI క్రియేషన్స్ పతాకంపై సుభాని దర్శకత్వంలో ఎం.అనిత నిర్మిస్తున్న చిత్రం 'జై జై దుర్గమ్మ'.  ఈ చిత్రంలోని ట్రైలర్ ని ప్రముఖ నిర్మాత సాయి వెంకట్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్ర లోగోను ప్రముఖ దర్శకులు వి. సముద్ర చేతుల మీదుగా విడుదల చేశారు.  ఈ సందర్భంగా ప్రతాని  రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ... "ఈమధ్య కాలంలో నేను ఇంత మంచి భారీ గ్రాఫిక్స్ ట్రైలర్ చూడలేదు దేవి, అరుంధతి చిత్రాలు గుర్తుకు వస్తున్నాయి. మంచి విజయం సాధిస్తుంది'' అన్నారు.  నిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ..  "ఫ్యామిలీతో కలిసి చూసే మంచి చిత్రం ఇది.  భారీ గ్రాఫిక్స్ తో మీ ముందుకు వస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుంది" అని అన్నారు.  దర్శకులు వి. సముద్ర మాట్లాడుతూ.. నాడు రోజా గారు చేసిన దుర్గమ్మ చిత్రం గుర్తుకువస్తుంది. అందరూ చూసి ఆనందించవలసిన చిత్రం ఇది ట్రైలర్ చాలా బాగుంది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.  మంచి విజయం సాధించాలి" అని అన్నారు  నిర్మాత చిన్ని మాట్లాడుతూ ...

"వీక్షణం" సినిమా రివ్యూ

Image
రామ్ కార్తీక్, క‌శ్వి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "వీక్షణం".  ఈ చిత్రాన్ని ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మ‌నోజ్ ప‌ల్లేటి డైరెక్ట్ చేసిన "వీక్షణం" సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది.  అయితే ఒకరోజు ముందుగానే  ఈ సినిమాను స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా ప్రదర్శించారు.  టీజర్ సహా ట్రైలర్ తోనే సినిమా మీద ఆసక్తి పెంచిన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మన రివ్యూ లో చూద్దాం.  కథ :  హైదరాబాదులో ఒక గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉండే అర్విన్ (రామ్ కార్తిక్)కు బైనాకులర్స్ తో తన ఇంటి చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళలో ఏం జరుగుతుందో తెలుసుకునే అలవాటు ఉంటుంది. తన స్నేహితుడితో కలిసి అలా చూస్తున్న సమయంలోనే అతనికి నేహ(కశ్వి ) మీద ప్రేమ పుడుతుంది. ఆమెను ప్రేమలో పడేసేందుకు తన స్నేహితుడి సహాయంతో అనేక ప్రయత్నాలు చేయగా చివరికి ఆ ప్రయత్నాలు ఫలించి ఆమె ప్రేమలో పడుతుంది. ఆమెతో గొడవ అయిన సమయంలో మరో ఇంటిని అలాగే పరిశీలిస్తుండగా ఒక అమ్మాయి రోజుకు ...