మాధవ్ ఎనర్జిటిక్ గా పర్ ఫార్మ్ చేశాడు, రవితేజ గారి స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా - మిస్టర్ ఇడియట్" సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న సినిమా "మిస్టర్ ఇడియట్". ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పీ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ "మిస్టర్ ఇడియట్" సినిమాను నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో "మిస్టర్ ఇడియట్" సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో *ఎడిటర్ విప్లవ్ నైషధం మాట్లాడుతూ* - "మిస్టర్ ఇడియట్" కంటెంట్ ఉన్న మంచి కమర్షియల్ మూవీ. ఈ చిత్రంతో మాధవ్, సిమ్రాన్ పరిచయం అవుతున్నా, వాళ్ల నటన ఎక్కడా కొత్తవాళ్లు చేసినట్లు అనిపించదు. ఈ చిత్రానికి వర్క్ చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గౌరి గారికి, ప్రొడ్యూసర్ రవిచంద్ గారికి థ్యాంక్స్. అన్నారు. *సినిమాటోగ్రాఫర్ రామ్ రెడ్డి మాట్లాడుతూ* - "మిస్టర్ ఇడియట్" ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటు