ZEE5లో సెప్టెంబర్ 27న స్ట్రీమింగ్ కానున్న బ్లాక్ బస్టర్ హారర్ మూవీ ‘డీమాంటే కాలనీ 2’
ZEE5 ప్రేక్షకులారా! నిద్ర లేని రాత్రి కోసం సిద్ధంగా ఉన్నారా!.. ఇండియాలో వైవిధ్యమైన సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ టాప్ పోజిషన్‌లో దూసుకెళ్తోన్న సంస్థ ZEE5. రఘుతాత, నునక్కుళి వంటి ఫ్యామిలీ బ్లాక్‌బస్టర్స్‌ను అందించిన జీ 5.. ఈసారి భయంతో థియేటర్స్‌లో ప్రేక్షకులను మెప్పించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘డీమాంటే కాలనీ 2’తో మెప్పించటానికి సిద్ధమైంది. వెన్నులో వణుకు పుట్టించేలా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 27 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అరుల్‌నిధి, ప్రియా భవానీ శంకర్ అద్భుతమైన నటనతో సీట్ ఎడ్జ్‌లో ప్రేక్షకులను కూర్చోపెట్టారు. తమిళ్ సినీ హిస్టరీలో ఫ్రాంచైజీగా రూపొందిన ‘డీమాంటే కాలనీ2’ రూ.55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ప్రేక్షకులను భయానికి గురి చేసిన లార్డ్ డీమాంట్, సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు మరోసారి వస్తున్నారు. ‘డీమాంటే కాలనీ 2’ చిత్రం ప్రేక్షకులను వెన్నులో వణుకు పుట్టించే అనుభవానికి గురి చేసింది. శాప...