హీరో చియాన్ విక్రమ్ కెరీర్ లో "తంగలాన్" హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించడం సంతోషంగా ఉంది - నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా
చియాన్ విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ "తంగలాన్" ఈ నెల 15న థియేటర్స్ లోకి వచ్చి అన్ని చోట్ల నుంచీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందించగా..నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. "తంగలాన్" సినిమాకు వస్తున్న హ్యూజ్ రెస్పాన్స్ పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా. ఒక మంచి సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకాన్ని "తంగలాన్" నిలబెట్టిందని ఆయన అన్నారు. తాజా ఇంటర్వ్యూలో "తంగలాన్" సినిమా సక్సెస్ గురించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడారు. - "తంగలాన్" సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. మేము ఇంత భారీ ఓపెనింగ్స్ తెలుగులో ఎక్స్ పెక్ట్ చేయలేదు. మేము అనుకున్న దానికంటే రెట్టింపు కలెక్షన్స్ వస్తున్నాయి. కలెక్షన్స్ తో మేము ఆశ్చర్యపోతున్నాం. ఏ, బీ, సీ సెంటర్స్ అన్నింటా మంచి వసూళ్లు వస్తున్నాయి. చియాన్ విక్రమ్ గారి కెరీర్ లో ఇ...