పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న "దీక్ష" మూవీ
ఆర్.కె. ఫిలింస్, స్నిగ్ధ క్రియేషన్స్ బ్యానర్స్‌పై ప్రముఖ దర్శక, నిర్మాత, తెలంగాణ ఫిలిమ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దీక్ష’. పినిశెట్టి అశోక్ కుమార్ నిర్మాత. కిరణ్‌కుమార్, అలేఖ్యరెడ్డి జంటగా నటిస్తున్నారు. తాజాగా జరిగిన కార్యక్రమంలో ఈ చిత్ర ప్రోగ్రెస్ ను తెలిపారు దర్శక నిర్మాత ఆర్ కే గౌడ్. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్, నటుడు జేవీఆర్, నటి తులసి, అనూష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ - మా ‘దీక్ష’సినిమా షూటింగ్ పూర్తయింది. గ్రాఫిక్ వర్క్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. "దీక్ష" ఉంటే ఏదైనా సాధించగలం అనే పాయింట్ తో మూవీని తెరకెక్కించాం ఈ మూవీలో హీరో కిరణ్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ఆయనకు హీరోగా మంచి పేరు తెచ్చే చిత్రమిది. అలాగే జేవీఆర్ గారు ఓ కీ రోల్ చేశారు. ఆయనకు ధర్మవరపు సుబ్రహ్మణ్యం లాంటి ఇమేజ్ వస్తుంది. తులసి, అనూష ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. అందంగా తెరపై కనిపిస్తారు. వారికి కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. కిరణ్ , జేవీఆర్ గారు మా నెక్ట్ మ...