దిగ్గజ గీత రచయితల సమక్షంలో ఘనంగా "రేవు" సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్, ఆగస్టు రెండో వారంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రేవు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ సూపర్ విజన్ జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు.. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రేవు సినిమా ఆగస్టు రెండో వారంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. గీత రచయితలు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్ అతిథులుగా ఈ రోజు హైదరాబాద్ లో రేవు సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత చంద్రబోస్ మాట్లడుతూ - రేవు సినిమా ఆడియో ఫంక్షన్ కు మా ప్రభు అన్న పిలిస్తే వచ్చాను. ఇక్కడికి వచ్చి ఈ సినిమా పాటలు విన్న తర్వాత సరైన కార్యక్రమానికే వచ్చాను అనిపించింది. అశోక్ తేజ గారిని చూసి చాలా రోజులవుతోంది. అలాగే అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, రామజోగయ్...