Posts

ఆగస్ట్ 2న ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ రీ రిలీజ్

Image
ప్రేమ కథా చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తూనే ఉంటుంది. పైగా గౌతమ్ మీనన్ వంటి దర్శకులు తీసిన చిత్రాలను అయితే ఎప్పుడూ మరిచిపోలేరు. ఆయన తీసిన ఎన్నో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మూవీస్ ఇప్పటి తరాల్ని కూడా అలరిస్తూ ఉంటాయి. నాని, సమంత కలిసి చేసిన 'ఎటో వెళ్లిపోయింది మనసు' అనే సినిమా కుర్రాళ్ల హృదయాల్ని హత్తుకుంది. ఈ మూవీని ఫోటాన్ కథాస్ సమర్పణలో తేజ సినిమా బ్యానర్ మీద సి.కళ్యాణ్ నిర్మించారు. ఆగస్ట్ 2న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ రీ రిలీజ్ చేస్తున్నారు.  పన్నెండేళ్ల క్రితం వచ్చిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీని మళ్లీ ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. అసలే టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండగా.. ఇప్పుడు నాని, సమంతల క్యూట్ లవ్ స్టోరీని తెరపైకి తీసుకు రాబోతున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం, ఇళయరాజా సంగీతం ఈ సినిమాను క్లాసిక్‌గా నిలబెట్టాయి. ఇళయరాజా అందించిన మెలోడీ గీతాలు ఇప్పటికీ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటాయి. మళ్లీ ఈ చిత్రాన్ని వీక్షించి నాటి రోజుల్లోకి వెళ్లేందుకు ఆడియెన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

'ఫస్ట్ లవ్' సాంగ్ లో బ్యూటీఫుల్ లవ్ స్టొరీ చాలా నచ్చింది. సాంగ్ తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది: ఫస్ట్ లవ్ సాంగ్ టీజర్ లాంచ్ లో హీరో శ్రీవిష్ణు

Image
దీపు జాను, వైశాలిరాజ్  లీడ్ రోల్స్ లో బాలరాజు ఎం డైరెక్ట్ చేసి బ్యూటీఫుల్ మ్యాజికల్ ఆల్బం 'ఫస్ట్ లవ్'. వైశాలిరాజ్ నిర్మించిన ఈ ఆల్బం టీజర్ ని సక్సెస్ ఫుల్ హీరో శ్రీవిష్ణు లాంచ్ చేశారు.  'ఫస్ట్ లవ్వా.. అతను నీతో చెప్పిన ఫస్ట్ మాట ఏంటి?' అనే డైలాగ్ తో మొదలైన సాంగ్ టీజర్ మెస్మరైజ్ చేసింది. కంపోజర్ సంజీవ్.టి ఈ సాంగ్ ని అందరూ మళ్ళీ మళ్ళీ పాడుకునే చార్ట్ బస్టర్ నెంబర్ గా ట్యూన్ చేశారు.   'మనస్సే చేజారే నీ వల్లే   పతంగై పోయిందే నీ వెంటే  ఇదంతా కల కాదా'' అంటూ కిట్టు విస్సాప్రగడ రాసిన బ్యూటీఫుల్ లిరిక్స్ ని సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరాం పాడిన తీరు హార్ట్ వార్మింగ్ గా వుంది.  లీడ్ పెయిర్ దీపు జాను, వైశాలిరాజ్ లైఫ్ లో డిఫరెంట్ ఫేజస్ ని చాలా వండర్ ఫుల్ గా ప్రజెంట్ చేశారు. వారి కెమిస్ట్రీ చాలా డిలైట్ ఫుల్ గా వుంది. ఈ టీజర్ క్లైమాక్స్ ఫుల్ సాంగ్ కోసం ఎదురుచూసేలా చాలా ఎక్సయిట్మెంట్ ని పెంచింది.  డైరెక్టర్ బాలరాజు ఎం ఈ సాంగ్ ని మెమరబుల్ ఆల్బంగా మలిచారని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. కాన్సెప్ట్ చాలా యూనిక్ అండ్ లవ్లీ గా వుంది. మారుతి పెమ్మసాని అందించ...

ఆగ‌స్ట్ 30న దేవ్ హీరోగా దేవ్ గిల్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘అహో! విక్రమార్క’ గ్రాండ్ రిలీజ్

Image
బ్లాక్‌బస్టర్ 'మగధీర'తో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు,  ఆకర్షణీయమైన నటనతో దేవ్ కథానాయకుడిగా  దేవ్ గిల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అహో! విక్రమార్క’. పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఆగ‌స్ట్ 30న భారీ ఎత్తున తెలుగు, త‌మిళ‌, హిందీ, కన్న‌డ‌ భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఇస్తూ మేక‌ర్స్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.  రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను గ‌మనిస్తే హీరో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తోన్న‌ దేవ్ విల‌న్‌కు గ‌ట్టి పంచ్ ఇస్తున్నారు. ఈ సంద‌ర్భంగా... హీరో దేవ్ మాట్లాడుతూ ‘‘‘అహో! విక్రమార్క’తో,  పోలీసుల ధైర్యం, అంకిత భావాన్ని గొప్పగా చూపించబోతున్నాం.  సినిమా చాలా బాగా వచ్చింది. ఆగస్ట్ 30 పాన్ ఇండియా లెవ‌ల్లో భారీ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు నాలోని న‌టుడిని ఓ కోణంలో చూసిన ప్రేక్ష‌కులు మ‌రో కోణాన్ని వెండితెర‌పై చూస్తారు’’ పేర్కొన్నారు. దర్శకుడు పేట త్రికోటి మాట్లాడుతూ ‘‘అహో! విక్రమార్క’ సినిమా పోలీసుల పవర్‌ను తెలియ‌జేసేది. సినిమాను అనుకున్న ప్లానింగ్ ...

అజిత్ కుమార్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాత సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘విడాముయ‌ర్చి’ షూటింగ్ పూర్తి

Image
అగ్ర క‌థానాయ‌కుడు అజిత్‌కుమార్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయ‌ర్చి’. ఈ క్రేజీ కాంబోలో  సినిమా అన‌గానే అభిమానులు స‌హా అంద‌రిలోనూ భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలోని అజిత్ లుక్ బయటకు రావడంతో ఒక్కసారిగా అంచనాలన్నీ రెట్టింపు అయ్యాయి.  ‘విడాముయ‌ర్చి’ ప్రారంభం నుంచీ కోలీవుడ్, టాలీవుడ్‌లో ఈ మూవీపై అందరి దృష్టి పడింది. టాప్ స్టార్స్‌, టెక్నీషియ‌న్స్ అందరూ ఈ చిత్రంలో భాగ‌మ‌య్యారు. ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో స్టార్స్‌తో భారీ బ‌డ్జెట్ చిత్రాలు, డిఫ‌రెంట్ కంటెంట్ బేస్డ్ సినిమాల‌ను నిర్మిస్తోన్న టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌. ఈ సంస్థ అధినేత సుభాస్క‌ర‌న్..‘విడాముయ‌ర్చి’ సినిమాను నిర్మిస్తున్నారు. ఆద్యంతం ఆక‌ట్టుకునే ఎంట‌ర్‌టైన్మెంట్ చిత్రాల‌తో పాటు విల‌క్ష‌ణ‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడిగా పేరున్న మ‌గిళ్ తిరుమేని అజిత్‌తో భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.  అజిత్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘మంగాత’ (తెలుగులో గ్యాంబ్లర్)లో అజిత్ కుమార్‌, త్రిష‌, యాక్ష‌న్ కి...

ఘనంగా ‘రామ్‌ ఎన్‌ఆర్‌ఐ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక.. జూలై 26న గ్రాండ్ రిలీజ్

Image
బిగ్‌బాస్‌ ఫేమ్‌ అలీ రజా కథానాయకుడిగా, సీతా నారాయణన్‌ కథానాయికగా నటించిన చిత్రం ‘రామ్‌ ఎన్‌ఆర్‌ఐ’. ‘పవర్‌ ఆఫ్‌ రిలేషన్ షిప్‌’ అనేది ఈ చిత్రం ఉపశీర్షిక.  ఈ చిత్రానికి ఎన్.లక్ష్మీ నందా దర్శకుడు. మువ్వా క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌ఎంకే ఫిల్మ్స్‌ సింగులూరి మోహన్‌కృష్ణ సమర్పణలో మువ్వా సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని జూలై 26న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌కు ప్రసన్న కుమార్, లయన్ సాయి వెంకట్, రామకృష్ణ గౌడ్, రామసత్య నారాయణ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం..  *ప్రసన్న కుమార్ మాట్లాడుతూ..* ‘వీళ్లు సినిమా చేసే టైంకి కందుల దుర్గేశ్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యారు. దగ్గుబాటి పురందేశ్వరి, కోమటిరెడ్డి గారి విషెస్ వీరికి ఉన్నాయి. సినిమా టీం ఎంతో కష్టపడి పని చేశారు. ఇంత మంచి టీం పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది’ అని అన్నారు.  *ఎన్.లక్ష్మీ నందా మాట్లాడుతూ..* ‘నాకు సపోర్ట్ చేసిన నా టీంకు ప్రత్యేకంగా థాంక్స్. పుట్టిన ఊరికి ఏదైనా చేయాలని కోరుకు...

"డార్లింగ్"లో తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న నభా నటేష్

Image
హీరోయిన్ నభా నటేష్ మంచి పర్ ఫార్మర్ అనే పేరు అటు ప్రేక్షకుల్లో ఇటు చిత్ర పరిశ్రమలో ఉంది. తన రీసెంట్ మూవీ "డార్లింగ్" తో ఈ గుర్తింపును మరింతగా పెంచుకుంది నభా నటేష్. ఈ సినిమాలో స్ప్లిట్ పర్సనాలటీ క్యారెక్టర్ లో నభా నటేష్ నటన అందరినీ ఆకట్టుకుంటోంది. ఐదారు వేరియేషన్స్ లో నటించి ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేస్తోంది నభా. ఆమె పాత్రకు ప్రేక్షకులు థియేటర్స్ లో బాగా కనెక్ట్ అవుతున్నారు. కెరీర్ స్టార్టింగ్ లోనే నభాకు ఇలాంటి మంచి క్యారెక్టర్ దొరకడం ఆ క్యారెక్టర్ లో ఆమె మెప్పించేలా పర్ ఫార్మ్ చేయడం విశేషమనే చెప్పుకోవాలి.  "డార్లింగ్" సినిమా ట్రైలర్ రిలీజ్ నుంచే నభా నటేష్ యాక్టింగ్ కు అప్రిషియేషన్స్ వచ్చాయి. ఇలాంటి పాత్రలో నటించాలనేది తన డ్రీమ్ గా చెప్పుకుందీ హీరోయిన్. "డార్లింగ్" సినిమాలో ప్రియదర్శితో కలిసి నభా నటేష్ నటించింది. ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించారు. గతవారం "డార్లింగ్" సినిమా థియేటర్స్ లోకి వచ్చింది.

వరుణ్ సందేశ్ 'విరాజి' చిత్రం ట్రైలర్ ను విడుదల చేసిన శ్రీకాంత్ అడ్డాల

Image
మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం "విరాజి". ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. అయితే ఈరోజు వరుణ్ సందేశ్ పుట్టిన రోజు సందర్భంగా 'కొత్త బంగారు లోకం' చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విరాజి చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ "వరుణ్ సందేశ్ నా మొదటి సినిమా కొత్త బంగారు లోకం లో హీరో గా నటించాడు. ఇప్పుడే విరాజి సినిమా ట్రైలర్ చూసాను. ట్రైలర్ చాలా బాగుంది. థ్రిల్లింగ్ గా అనిపించింది, విజువల్స్ కొత్తగా ఉన్నాయి, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి, రిచ్ గా ఉంది సినిమా.  సినిమా టైటిల్, వరుణ్ సందేశ్ గెట్ అప్ కూడా మరియు సినిమా కథ కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉన్నాయి. ఈ చిత్రం వరుణ్ సందేశ్ కి సూపర్ హిట్ పక్కాగా అనిపిస్తుంది.  నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల గారికి నా అభినందనలు. వరుణ్ సందేశ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ విరాజి చిత్రం ఆగస్టు 2న విడుదల అవుతుంది, అందరు చూసి సూపర్ హిట్ చేయాలి" అని కోరుకున్నారు సినిమా పేరు: విరాజి న...