జూన్ 25న యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, లైకా ప్రొడక్షన్స్ , రెడ్ జెయింట్ బ్యానర్స్ భారీ పాన్ ఇండియా చిత్రం ‘భారతీయుడు 2’ విడుదల
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ ప్రమోషనల్ ప్లానింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో జూన్ 25న ‘భారతీయుడు 2’ ట్రైలర్‌ను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ‘భారతీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. ‘భారతీయుడు 2’ ట్రైలర్ అనౌన్స్‌మెంట్ డేట్‌ను తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో ముసలి పాత్రలోని కమల్ హాసన్ ట్రాలీ బ్యాగ్‌తో మెట్లు ఎక్కుతున్నారు. అంటే పోస్టర్‌తో ట్రైలర్ వచ్చేస్తుందనే విషయాన్ని సింబాలిక్‌గా చక్కగా చెప్పినట్లుంది పోస్టర్ చూస్తుంటే. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సేనాపత...