Posts

అరుణ్ ఆదిత్య - అప్సర రాణి జంటగా కొత్త సినిమా ప్రారంభం

Image
అరుణ్ ఆదిత్య - అప్సర రాణి జంటగా, వినూత్న సెల్యూలాయిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై కృష్ణబాబు దర్శకత్వంలో కొత్త సినిమా ప్రొడక్షన్ నం.1 ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మం ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. జస్ట్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ.. ఈ   కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ డైరెక్ట‌ర్ వి. సముద్ర తొలిషాట్‌కు గౌరవ దర్శకత్వం వ‌హించ‌గా, ప్ర‌ముఖ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ హీరోయిన్‌పై క్లాప్ కొట్టారు. తొలిషాట్‌కు సంగీత దర్శకురాలు యం యం శ్రీ‌లేఖ కెమెరా స్విచ్చాన్  చేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా డైరెక్టర్ కృష్ణబాబు మాట్లాడుతూ.. ''సినిమా ప్రారంభోత్స‌వం ఒక పండ‌గ‌గా జ‌రగ‌డం సంతోషంగా ఉంది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అతిథుల‌కు ధ‌న్య‌వాదాలు. ఏప్రిల్ 20 నుంచి 10 రోజుల పాటు షెడ్యూల్ చేస్తాం. స‌బ్జెక్టు బాగా వ‌చ్చింది. అరుణ్ ఆదిత్య - అప్సర రాణి జంట‌గా చేస్తున్న‌ ఈ సినిమా ఖ‌చ్చితంగా అంద‌రికి న‌చ్చుతుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తాం..'' అని తెలిపారు. ...

కారుణ్య శ్రేయాన్స్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై కొత్త సినిమా ప్రారంభం

Image
క్రిస్పి సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్టుతో, కారుణ్య శ్రేయాన్స్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై, పోతురాజు నర్సింహారావు, కందిమల్ల సాయితేజ నిర్మాణంలో, ఊర శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రొడ‌క్ష‌న్ నం.1 చిత్రం పూజ కార్యక్రమాలతో ప్రారంభ‌మైంది. యస్వంత్, సాయితేజ, అరుషి, నిఖిల హీరోలు హీరోయిన్లుగా నటించే ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ ఫిలించాంబ‌ర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమ్మ న్యూస్ ఛానల్ సీఈఓ కంది రామచంద్రారెడ్డి గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ కొట్టారు, రచయిత బిక్కి కృష్ణ స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా వారు చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ... ఈ సినిమా నిర్మాణంలో నా వంతు  బాధ్యత తీసుకుంటా. మంచి టాలెంట్ ఉన్న ఊర శ్రీను గొప్ప దర్శకుడు అవుతాడు. కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా వంద కోట్లు సాధిస్తున్న రోజులు ఇవి. ఈ సినిమా కూడా అలాంటి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. లిరిక్ రైటర్ కళారత్న బిక్కి కృష్ణ మాట్లాడుతూ... సాహిత్య విలువలు ఉన్న పాటలు రాశాను. ఈ సినిమాకు రామసత్యనారాయణ సహకారం ఉంటుంది.  చిత్ర ని...

పెనమలూరు నుంచి ఫిక్స్.. బరిలోకి యువనేత!

Image
గతంలో ఎప్పుడూ లేనివిధంగా చాలా ఫాస్ట్‌గా అభ్యర్థులను ప్రకటిస్తున్న తెలుగుదేశం పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే 128 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించగా.. ఈసారి యువతకు పెద్దపీట వేస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా ఉన్న కృష్ణాజిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గంపై కూడా అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది.  ఇక్కడినుంచి విజయవాడకు చెందిన తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని చంద్రశేఖర్‌(చందు)కు టిక్కెట్ ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. నారా లోకేష్‌కి దగ్గరగా ఉండడం.. పార్టీ యువత కార్యక్రమాల్లో చురుకుదనం.. యువగళం నిర్వహణలో క్రియాశీలకంగా ఉండడం తదితర కారణాలతో పాటు యువతకు ఎక్కువ సీట్లు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుగుదేశం చందుకు సీటు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుగుదేశం కార్యవర్గాలు చెబుతున్నాయి.  గతంలో దేవినేని చందు గన్నవరంలో పోటీ చేయడానికి రెడీగా ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, తర్వాతికాలంలో అక్కడ నుంచి యార్లగడ్డ వెంకట్రావు పోటీకి సిద్ధం అవడంతో దేవినేని చందుకు ...

ఆ ఇద్దరే ఎందుకు ముఖ్యమంత్రులుగా ఉండాలి?* రాష్ట్రానికి బీసీ, దళిత, కాపు సీఎంలు ఉండకూడదా..?

Image
* బీసీవై ఆధ్వర్యంలో 23న వివిధ సంఘాలతో సమావేశం * కుటుంబ పార్టీలకు అంతం పలికేందుకు రండి  * బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ పిలుపు.. సమాజంలో మార్పు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, బలహీన వర్గాల రాజ్యాధికారం లక్ష్యంగా రాజకీయ పార్టీ స్థాపించిన భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత బొడె రామచంద్ర యాదవ్.. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, వ్యాపార సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 23న మంగళగిరి లోని హ్యాపీ రిసార్ట్స్ నందు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకూ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు రామచంద్ర యాదవ్ తెలిపారు.  *ఆ ఇద్దరే ముఖ్యమంత్రులుగా ఉండాలా..?* దోచుకుతింటున్నా.. దోపిడీ చేస్తున్నా.. ఆరాచకం  సాగిస్తున్నా.. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నా.. యువతను బలి చేస్తున్నా .. ఆ రెండు కుటుంబాలే పాలించాలా..? ఆ ఇద్దరే ముఖ్యమంత్రులుగా ఉండాలా ..? 90 శాతం జనాభా ఉన్న వర్గాలకు ఎందుకు అధికారం దక్కకూడదు..! బీసీ, దళిత, కాపు, మైనార్టీ ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు ? అని ఆయన ప్రశ్నించార...

పృథ్వీరాజ్ సుకుమారన్ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా నుంచి 'తేజమే రెహమానేనా..' లిరికల్ సాంగ్ విడుదల, ఈ నెల 28న పాన్ ఇండియా రిలీజ్ కు వస్తున్న మూవీ

Image
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో  థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. డబుల్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్నందించిన "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా నుంచి  'తేజమే రెహమానేనా..' అనే లిరికల్ సాంగ్ ను ఇవాళ విడుదల చేశారు. 'తేజమే రెహమానేనా..' లిరికల్ సాంగ్ కు రాకేందు మౌళి లిరిక్స్ అందించగా జితిన్ రాజ్ పాడారు. ఏఆర్ రెహమాన్ ఎప్పటిలాగే బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. 'తేజమే రెహమానేనా తేజమే రహీమ్, యాడున్నావో యాడున్నావో గుండె తడవగ వానై పో..ఉప్పే లేని కన్నీరొలికి, ఆవిరి పెదవుల తాకగ రా..ఆటు పోటుల ఆకలి ఎడారిలో చూడన చూడన నీ కలకై...' అంటూ ఎడారి కష్టాల్లో ఉన్న హీరో తన ప్రేయసిని తల్చుకుంటూ పాడే ఎమోషనల్ ...

GA2 Pictures, Bunny Vas, Vidya Koppineedi, Narne Nithiin, Anji K Maniputhra's "AAY" first single, Lovable Melody of the Season Sufiyana out now

Image
The most successful and prestigious production GA 2 Pictures next Production No.9 stars young and energetic hero Narne Nithiin and gorgeous Nayan Sarika in lead roles. The film titled "AAY" is directed by debutant filmmaker Anji Kanchipalli. Talented producers Bunny Vas and Vidya Koppineedi are bankrolling this fun entertainer. The film is hiking prospects with its intriguing promotional content and hilarious concept videos. Here comes soothing number from the movie. Lyrical video of the film's first single, a "Lovable Melody of the Season" Sufiyana has been unleashed. It’s a mesmerizing love ballad that will connect instantly. Ram Miriyala is in top-form and the song hits you right away. It gives soothing and soulful vibes on the first listening. Ram Miriyala, Sameera Bharadwaj, and Ramya Shree make this even more special as they croon the lyrics in a beautiful manner. Top lyricist Shree Mani has penned some touching lyrics with a catchy vibe. The b...

పూజా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై షాహిద్ కపూర్ ‘అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్’

Image
మన పురాణాల్లోని అద్భుతమైన పాత్రను ఈ ఆధునిక యుగానికి పరిచయం చేసేందుకు, థ్రిల్లింగ్ జర్నీని ప్రేక్షకులను ఇచ్చేందుకు పూజా ఎంటర్‌టైన్‌మెంట్ సిద్ధమవుతోంది. షాహిద్ కపూర్ హీరోగా.. ఈ మాగ్నమ్ ఓపస్‌ను సచిన్ రవి తెరకెక్కిస్తున్నారు. ఊహకు, వాస్తవాలకు మధ్య ఉండే అద్భుతమైన కథను, గాధను 'అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్' చూపించబోతోన్నారు. ‘అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్’ అనే ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ ఇలా ఐదు భాషల్లో రానుంది. ఈ చిత్రం మహాభారతంలోని చిరంజీవి అయిన ఓ యోధుడు (అశ్వత్థామ) కథను చెప్పబోతోంది. ఇప్పటికీ అశ్వత్థామ బతికే ఉన్నారని నమ్ముతుంటారు. వేగవంతమైన సాంకేతిక పురోగతులు, అద్భుతమైన సామర్థ్యాలతో పరిగెడుతున్న ఈ ప్రస్తుత యుగంలో, అశ్వత్థామ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడు అనేది చూపించబోతోన్నారు. హై యాక్షన్ ప్యాక్డ్ సీన్లతో సినిమాను అద్భుతంగా తీర్చి దిద్దబోతోన్నారు. అమర జీవిగా ఇన్ని వేల సంవత్సరాలు ఎలా బతికి ఉన్నాడు అనే పాయింట్‌ను కూడా చూపించబోతోన్నారు.  ఇది గతం, వర్తమానం మధ్య జరిగే యుద్దం అని చెప్పుకొచ్చారు. ఈ సీన్లు రోమాలు నిక్కబొడుచుకునేలా తెరకెక్కిస్త...