నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానున్న "ప్రేమిస్తున్నా" కు టాలెంటెడ్ డైరెక్టర్ "వెంకీ అట్లూరి" బెస్ట్ విషెస్ !!!
వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకీ అట్లూరి మాట్లాడుతూ... ''ప్రేమిస్తున్నా ట్రైలర్ బాగుంది, నవంబర్ 7న విడుదల కాబోతున్న ఈ సినిమా సక్సెస్ అవ్వాలని సాత్విక్ వర్మ, ప్రీతీ నేహకు మంచి పేరు రావాలని, దర్శకుడు భను కు నిర్మాత కనకదుర్గారావు గారికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు. ప్రేమిస్తున్నా చిత్రం నుండి ఇటీవల సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా ను మేకర్స్ విడుదల చేశారు. 56 సెకెన్స్ నిడివి ఉన్న కంటెంట్ యువతను విపరీతంగా ఆకట్టుకొంటోంది. సినిమా ఎలా ఉండబోతోందో ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది, స్వచ్ఛమైన ప్రేమకథతో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా పోటీపడి నటించారు. దర్శకుడు భాను ప్రేమిస్తున్నా సినిమాను న్యూ ఏజెడ్ లవ్ స్టో...