"శ్రీ వీర ప్రతాప 1940" నవంబర్ 29న థియేటర్స్ లో విడుదల !!!


ఆదిత్య క్రియేషన్స్ బ్యానర్ పై రాజా రవీందర్, చరిష్మా, సీత, వీటి రాజు, సుబ్బారావు, జబర్దస్త్ రాజమౌళి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా శ్రీ వీర ప్రతాప 1940. లయన్ డాక్టర్ ఎస్.వి.పి.కె.హెచ్.జి కృష్ణంరాజు నిర్మించిన ఈ సినిమాకు డాక్టర్ వేల్పుల నాగేశ్వర రావు దర్శకత్వం వహించారు. 

షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 1940 లో రాజుల కాలంలో జరిగిన ఒక చారిత్రాత్మక కథ కథనాలతో ఈ సినిమా రోపొందించబడింది. 

కామెడీ, సస్పెన్స్ తో కూడిన ఈ సినిమా అందరికి నచ్చేలా ఉంటుంది. భాను ప్రసాద్ సోయం ఈ సినిమాకు సంగీతం అందించారు. మోహన్ గుంటూ సినిమాటోగ్రఫీ తో పాటు ఎడిటర్ గా వ్యవహరించారు. బళ్లారి జయప్రద, మణి మహేశ్వర్, దైద పద్మరెడ్డి, వినుకొండ నాగేశ్వరరావు, బాలవర్ది రాజు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. శైలిష్ ఆనంద్ ఈ సినిమాకు డాన్స్ కంపోజ్ చేసారు. ఐటమ్ సాంగ్ ను సుస్మిత, విక్రమ్ కంపోజ్ చేశారు. కీర్తన క్రియేషన్స్ ప్రెవేట్ లిమిటెడ్ ఈ సినిమాను విడుదల చేస్తుంది, ఈ చిత్రాన్ని కిషోర్ బాబు LLB, పయనేని జయబాబు సమర్పిస్తున్నారు.

Comments

Popular posts from this blog

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

"ది ఇండియన్ స్టోరి" రివ్యూ - మంచి సందేశం, వినోదం కలిపిన సినిమా

టోని కిక్, సునీత మారస్యార్ హీరో హీరోయిన్లుగా A3 లేబుల్స్ బ్యానర్‌పై బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో లాంఛనంగా ప్రారంభమైన చిత్రం