Vijay Sethupathi Vikramarkudu re release on September 20.

విజయ సేతుపతి "విక్రమార్కుడు" సెప్టెంబర్ 20న రీ రిలీజ్  !!!!

రీ రిలీస్ ల హంగామా నడుస్తోంది, మంచి సినిమాలు ఎప్పుడూ వచ్చినా ఆడియాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన చాలా సినిమాలు రీ రిలీస్ లో కూడా భారీ కలెక్షన్స్ ను రాబట్టాయి.

హీరో విజయ్ సేతుపతి నటించిన జుంగా చిత్రం తమిళం లో 2018 లో విడుదల అయిన సంగతి తెలిసిందే. తమిళ్ లో సంచలన విజయం సాధించిన ఈ సినిమాలో సాయేశా, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటించారు.

గోకుల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సిద్ధార్ద్ విపిన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో బస్సు సర్వీసులో టికెట్ కలెక్టర్ గా విజయ్ సేతుపతి నటన అద్భుతం. అలాగే గ్యాంగ్ స్టర్ పాత్రలో కూడా నటించాడు. రెండు విభిన్నమైన రోల్స్ లో బాగా నటించాడు. 

 ఇప్పడు ఈ సినిమా మరోసారి థియేటర్స్ లో సందడి చేయనుంది. సెప్టెంబర్ 20 న  ఈ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది, వాణి వెంకటరమణ సినిమాస్  ద్వారా కాకర్లముడి రవీంద్ర కళ్యాణ్, అప్పసాని సాంబశివరావు ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ విడుదల చేయబోతున్నారు.  జయబాబు, కిషోర్ కుమార్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు.

ఈ చిత్ర దర్శకుడు గోకుల్ రాసిన కథ, కథనాలు థియేటర్స్ లో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసేలా ఉంటాయి. సాంగ్స్ కూడా బాగుంటాయి, యోగిబాబు కామెడీ, డూల్లీ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ.

Comments

Popular posts from this blog

Surya Purimetla's character first look from 'Ari' was released on the occasion of the inauguration of Ayodhya Ram Mandir

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

త్రిగుణ, మేఘా చౌదరి, మల్లి యేలూరి, Dr Y. జగన్ మోహన్, యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ 'జిగేల్' ఫస్ట్ లుక్ రిలీజ్