గ్రాండ్ గా "మెర్సి కిల్లింగ్" ప్రీ రిలీజ్ ఈవెంట్ !!!

సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన సినిమా "మెర్సి కిల్లింగ్" సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో  సిద్ధార్ద్ హరియల,  మాధవి తాలబత్తుల నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పిస్తున్నారు. ఏప్రిల్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు జి.అమర్ సినిమాటోగ్రాఫి అందిస్తుండగా ఎం.ఎల్.రాజా సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను యువ హీరో ఆకాష్ పూరి విడుదల చేశారు. 


తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి కుమార్, కోనా వెంకట్, పూరి ఆకాష్, యాంకర్ రవి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ...
మెర్సీ కిల్లింగ్ అనే సినిమా స్వేచ్ఛ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. స్వేచ్ఛ పాత్రలో హారిక బాగా నటించింది. దర్శకుడు సూరపల్లి వెంకటరమణ చక్కటి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. పార్వతీశం, ఐశ్వర్య పోటీ పడి నటించారు. నేను ఈ సినిమాలో మరో మంచి రోల్ లో ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. ప్రతి మహిళ చూడవలసింది సినిమా మెర్సి కిల్లింగ్ అని సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అకృత్యాలు ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారని తెలిపారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం మెర్సీ కిల్లింగ్ . స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుందని, అందరికి ఈ సినిమా కనెక్ట్ అవుతుందని అందరూ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కష్టపడి పనిచేశారని సినిమా బాగుందని ప్రివ్యూ చూసిన అందరూ అంటుంటే సంతోషంగా ఉందని దర్శకుడు వెంకటరమణ ఎస్ తెలిపారు. 


నటీనటులు:
సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, బేబీ హారిక, రామరాజు, సూర్య, ఆనంద్ చక్రపాణి, ఘర్షణ శ్రీనివాస్, షేకింగ్ శేషు, ఎఫ్.ఎం.బాబాయ్, రంగస్థలం లక్ష్మీ, ల్యాబ్ శరత్, హేమ సుందర్, వీరభద్రం, ప్రమీల రాణి తదితరులు.

సాంకేతిక నిపుణులు: 
బ్యానర్: సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్
డైరెక్టర్: వెంకటరమణ ఎస్
నిర్మాతలు: సిద్ధార్థ్ హరియల, మాధవి తాలబత్తుల
సమర్పణ: శ్రీమతి వేదుల బాల కామేశ్వరి
సినిమాటోగ్రఫీ: అమర్.జి
సంగీతం: ఎం.ఎల్.రాజ
ఎడిటర్: కపిల్ బల్ల
ఆర్ట్: నాయుడు
మాటలు: వై. సురేష్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పృథ్వి కడియం
లైన్ ప్రొడ్యూసర్:  బాబీ శివకోటి

Comments

Popular posts from this blog

Surya Purimetla's character first look from 'Ari' was released on the occasion of the inauguration of Ayodhya Ram Mandir

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"

ఫిబ్రవరి 16న “ఐ హేట్ లవ్ "