రమేష్ చెప్పాల "లగ్గం'' కు ముహూర్తం ఖరారు !!!

సుభిశి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం. భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సాయి రోనక్ ఈ సినిమాకు కథానాయకుడు. 

చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్. బేబీ చిత్ర కెమెరామెన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నరు అలాగే ప్రముఖ రచయితలు చంద్రబోస్, కాసర్ల శ్యామ్ సాహిత్యం అందిస్తున్నారు. 

లగ్గం అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో దర్శకుడు ప్రేక్షకులకు ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైన్ సబ్జెక్ట్ గా రాబోతున్న ఈ సినిమాలో వినోదంతో పాటు ఎమోషన్స్, పెళ్లి కల్చర్ ఉంటుంది. ఈ చిత్ర ముహూర్తం ఫిబ్రవరి 5న జరగనుంది. రెగ్యులర్ షూటింగ్ కూడా అదే రోజు ప్రారంభం కానుంది.

Comments

Popular posts from this blog

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి త్వరలో రాబోతున్న సత్యం రాజేష్, శ్రవణ్ , కాలకేయ ప్రభాకర్ !!!