సినీ ప్రముఖుల సమక్షంలో 19న 'సోగ్గాడు' స్వర్ణోత్సవం
నటభూషణ శోభన్ బాబు కథానాయకుడిగా, జయచిత్ర, జయసుధ కథానాయికలుగా రూపొందిన 'సోగ్గాడు' చిత్రం 50 ఏళ్లు పూర్తిచేసుకుని, స్వర్ణోత్సవం జరుపుకోనుంది. కె.బాపయ్య దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డుల కలెక్షన్స్ ను వసూలుచేసింది. 1975 డిసెంబర్ 19న విడుదలైన ఈ చిత్రం 2025 డిసెంబర్ 19 నాటికి సరిగ్గా 50 ఏళ్లను పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్, అభిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో శ్రేయాస్ మీడియా సౌజన్యంతో భారీ ఎత్తున ఈ చిత్రం స్వర్ణోత్సవ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ నెల 19న (శుక్రవారం) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్, బంజారాహిల్స్, రోడ్ నెం 10లోని (బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో) కొమరం భీమ్ ఆదివాసీ భవన్ లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ స్వర్ణోత్సవాన్ని కన్నుల పండువగా జరపనున్నారు. ఈ ఈవెంట్ లో ప్రముఖ నటీమణులు జయచిత్ర, జయసుధ, రాధిక, సుమలత, ప్రభ, రోజారమణి తదితరులతో పాటు ప్రముఖ గాయని పి.సుశీల, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు, అట్లూరి పూర్ణచంద్రరావు, రాశీ మూవీస్ ...